అమెరికాలో భారతీయుడిపై దాడి.. 15 సార్లు కత్తితో పొడిచి.. ఏం జరిగింది..?

అమెరికాలో భారతీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ దాడులకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా అమెరికాలో మరోసారి ఇలాంటి ఘటన రిపీట్ అయింది. అమెరికా ఉటాలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేసే భారతీయ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచాడు. నువ్వు ముస్లింవా..? అంటూ అదేపనిగా కత్తితో పొడిచి పరార్ అయ్యాడు. అయితే సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా ఎట్టకేలకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

అయితే పోలీసుల విచారణలో నిందితుడు 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సెన్ అని తేలింది. బాధితుడు ముస్లిం అయిన కారణంగానే తాను దాడికి పాల్పడినట్లు తెలిపాడు. తాను ముస్లింలను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు. అతని వ్యాఖ్యలకు పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటన వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ షాపింగ్ మాల్ లో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లార్సెన్ ఆ షాపింగ్ మాల్ కు వచ్చాడు. ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ ఆధారంగా అతడు సోహేల్ అని తెలుసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సోహేల్ తో మాట్లాడాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు.. అని అడగ్గా.. తాను భారత్ నుంచి వచ్చానని బదులిచ్చాడు సోహేల్.

Indian man stabbed 15 times in the US after being asked Are you a Muslim shocking news in usa

ఆ తర్వాత నువ్వు ముస్లింవా..? అని లార్సెన్.. సోహేల్ ను ప్రశ్నించాడు. అందుకు అవును అని సోహేల్ సమాధానం చెప్పగానే.. వెంటనే లార్సెన్ తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా 15 సార్లు దాడి చేసి పారిపోయాడు. ఇక పోలీసుల విచారణలో తాను ముస్లింలను చంపాలనే ఈ దాడి చేశానని లార్సెస్ ఒప్పుకున్నాడు. నేరం ఒప్పుకున్న కారణంగా అతనిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+