టిఎస్ సెట్ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు..జులై 8వరకు అవకాశం..!
టిఎస్ సెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించేందుకు సెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ప్రతి ఏటా జరుగుతుంది. ఇక, ఈ ఏడాది అర్హత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మే 4వ తేదిన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET - 2024) ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఈ పరీక్షకు సంబంధించిన సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభంకాగా, జులై 2వ తేదిన ముగిసింది. అయితే దరఖాస్తు స్వీకరణ గడువును అధికారులు జులై 8 వరకు పొడిగించారు. అభ్యర్థుల విన్నతుల మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఇక, ఈ పరీక్షకు అప్లయ్ చేయాలనుకునే ఓసీ అభ్యర్థులు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. రూ.1500 ఆలస్య రుసుముతో జులై 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2000 ఆలస్య రుసుముతో జులై 26 వరకు అప్లయ్ చేసుకోగలరు. రూ.3000 ఆలస్య రుసుముతో ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగస్టు 20 నుంచి హాల్‌టిక్కెట్లు..
ఇక, దరఖాస్తుల సవరణకు ఆగస్టు 8, 9 తేదీల్లో అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ సెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆగస్టు 20వ తేది నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో పొందరుపరచున్నట్లు అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు ఆగస్టు 20 నుంచి వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో తెలంగాణ సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనున్నాయి.












Click it and Unblock the Notifications