తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్ డిసెంబర్ 8 నుంచే: 29 నుంచి అడ్మిట్ కార్డులు

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్(పీఎంటీ), పీఈటీ టెస్టులు నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది.

అభ్యర్థులు నవంబర్ 29వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 3వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ లలో ఈ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

 TSLPRB physical measurements tests from december 8 for SI and constable candidates.

డిసెంబర్ 8వ తేదీన మొదలయ్యే ఈ ఈవెంట్స్ ను 23-25 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కానట్లయితే అభ్యర్థులు.. [email protected]కు ఈ-మెయిల్‌ చేయవచ్చని, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+