ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: అక్కడ మాత్రం అరగంటముందే పేపర్ లాక్కున్నారు!

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా గత అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడంతో.. నేడు అంటే ఆదివారం మళ్లీ ఆ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

వివిధ మార్గాల నుంచి పరీక్ష కేంద్రాలకు తరలివచ్చిన అభ్యర్థుల కోసం టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అభ్యర్థులను గేటు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించి పర్సులు, సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు ఉంటే బయట పెట్టించి లోనికి అనుమతించారు. షూ వేసుకుని వచ్చినవారిని గేటు వద్దే తీయించి లోనికి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.

 TSPSC Group-1 preliminary exam completed in telangana state.

ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఉదయం 8.30 గంటల నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 10.15 గంటల తర్వాత వచ్చిన వారిని ఆలస్యమైందంటూ పరీక్ష రాయడానికి అనుమతించలేదు. దీంతో పలువురు అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.

అరగంట ముందే పేపర్ లాక్కున్న ఇన్విజిలేటర్

రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని శ్రీ చైతన్య గ్రూప్-1 పరీక్ష కేంద్రంలో గందరగోళం నెలకొంది. పరీక్ష సమయం ముగిసిందంటూ.. అరగంట ముందే ఇన్విజిలేటర్ అభ్యర్థుల నుంచి పేపర్లు తీసుకున్నాడు. అయితే, బయటకు వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఇంకా అరగంట సమయం ఉందని తెలిసింది. దీంతో అభ్యర్థులు తమ పేపర్ తిరిగి ఇవ్వాలని ఇన్విజిలేటర్‌ను కోరారు. అయితే, ఆ పేపర్ తిరిగిచ్చేది లేదని ఇన్విజిలేటర్ తేల్చిచెప్పాడు.

ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ చైతన్య కాలేజీ క్యాంపస్‌లో దాదాపు 40 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే గ్రూప్-1 పేపర్ లీక్ కావడంతో నిరాశలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు ఇలాంటి సంఘటన ఎదురుకావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అరగంట ముందే పేపర్ లాక్కోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+