ఇకపై యూనివర్శిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు-యూజీసీ కీలక నిర్ణయం..!
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు ప్రయత్నిస్తున్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి నిర్వహిస్తున్న అడ్మిషన్లను ఇకపై రెండుసార్లు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో విశ్వవిద్యాలయాలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించడంతో పాటు విద్యార్ధులకు మరిన్ని కోర్సులు అభ్యసించేందుకు అవకాశం కలగనుంది.

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యా సంస్థలను సంవత్సరానికి రెండుసార్లు విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం జూలై-ఆగస్టులో మాత్రమే విద్యార్థులను చేర్చుకునేందుకు అనుమతి ఉంది. దీన్ని సవరిస్తూ యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. యూజీసీ నిర్ణయం ప్రకారం ఇకపై విద్యార్థులు జనవరి- ఫిబ్రవరి , జూలై-ఆగస్టులో రెండుసార్లు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం లభించింది.
యూజీసీ తాజా అనుమతి ప్రకారం విద్యాసంస్థలు విద్యార్ధులకు ఏ సీజన్ లో అడ్మిషన్ కావాలో ఎంచుకునే అవకాశం కల్పిస్తాయి.
అలాగే విద్యాసంస్థలు తమకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ ఆధారంగా రెండు సెషన్లలో అడ్మిషన్లు తీసుకునేందుకు అనుమతి లభిస్తుంది. రెండు సెషన్లలోనూ తప్పనిసరిగా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. విద్యాసంస్థలు తాము ఆఫర్ చేస్తున్న కోర్సుల ఆధారంగా రెండు సెషన్లలో అడ్మిషన్లను తీసుకోవచ్చని యూజీసీ తెలిపింది.












Click it and Unblock the Notifications