ONOS Scheme: 'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్'కు మంత్రివర్గం ఆమోదముద్ర.. అసలేంటీ స్కీమ్, పూర్తి వివరాలు
One Nation One Subscription: గత కొంతకాలంగా భారతీయ విద్యావిధానంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. కేవలం సిలబస్ అప్‌డేట్స్‌తో మాత్రమే సరిపెట్టకుండా వికసిత భారత్ @ 2047 నినాదంతో పలు అధునాతన చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్' పథకానికి ఇటీవల కేంద్రం మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాలు కలిగిన మెటీరియల్ అందుబాటులో ఉంచాలని కేంద్రం భావించింది. ఇందుకోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పరిశోధకులకు వివిధ దేశాలకు సంబంధించిన వ్యాసాలు మరియు జర్నల్స్‌ను యాక్సెస్ చేయడానికి 'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్' (ONOS) పథకాన్ని తీసుకొచ్చిది. ఇందుకుగాను 3 సంవత్సరాల్లో 6 వేల కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అయింది.

జాతీయ విద్యా విధానం (NEP) 2020 మరియు అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) లక్ష్యాలకు ఇది మద్దతు ఇస్తుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన అంతర్-విశ్వవిద్యాలయ కేంద్రమైన ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ (INFLIBNET) దీని నిర్వహణ చేపట్టనుంది. జాతీయ సభ్యత్వం ద్వారా ఆయా డాక్యుమెంట్స్‌కు యాక్సెస్ అందించనుంది. ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ విధానంలో జరగనుంది.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు మరియు R&D ప్రయోగశాలలు సహా అభివృద్ధి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో మోదీ సర్కారు ONOS అమలుకు ఉపక్రమించింది. 30 ప్రధాన అంతర్జాతీయ జర్నల్ పబ్లిషర్‌లు ఈ పథకంలో భాగస్వాములుగా ఉన్నారు. దాదాపు 13 వేల ఇ-జర్నల్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
అన్ని విభాగాల్లోని 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు శాస్త్రవేత్తలకు ముఖ్యంగా టైర్-2 మరియు టైర్-3 నగరాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేసిన "వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్" అనే పోర్టల్ ద్వారా ఈ వనరులను యాక్సెస్ చేయవచ్చు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications