Sanskrit: UP CM యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం.. సంస్కృత భాషకు మళ్లీ మంచి రోజులు
Yogi Adityanath: పూర్వ కాలంలో సంస్కృత భాషకు ఎంతో ఆదరణ ఉండేది. కాల క్రమంలో అదికాస్తా కనుమరుగైంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దాన్ని మరింత వాడుకలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఓ రాష్ట్రంలోని మదర్సాలలో విద్యార్థులకు సంస్కృతం నేర్పించేందుకు కృషి జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా భాషా వ్యాప్తి కోసం కీలక ముందడుగు వేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంస్కృత స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించారు. ఇది ఆ రాష్ట్రంలోని సంస్కృత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సహాయం చేయడంలో దోహదపడుతుంది. వీటిలో పాఠశాలలు, కళాశాలలు, మరియు విశ్వవిద్యాలయాలు కూడా ఉండటం గమనార్హం.

'దీపావళి పండుగకు ముందే ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. భాషాభివృద్ధి మరియు సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడంలో ఇది ప్రారంభం మాత్రమే. సంస్కృతంలోని నిజమైన సారాన్ని గ్రహించాలంటే పూర్తిగా మనసును దానిపై లగ్నం చేయడం అవసరం. భక్తి శ్రద్ధల నడుమ భగవంతుడితో అనుసంధానమైతే సంస్కృత భాష శక్తిని అనుభవించవచ్చు' అని సీఎం పేర్కొన్నారు.
సంస్కృతం తక్కువ ప్రాచుర్యం కలిగిన భాషగా పరిగణించబడుతున్నప్పటికీ, దాని వారసత్వాన్ని కాపాడడానికి కొందరు చేసిన కృషిని యోగి ప్రశంసించారు. 2017 నుంచి సంస్కృతానికి మరింత గౌరవం లభించినట్లు తెలిపారు. ఈరోజు ప్రారంభించిన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ సంస్కృతాన్ని మరింతగా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ స్కాలర్‌షిప్‌ను విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి సంస్థ కృషి చేయాలని కోరారు.
ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం 1.5 లక్షల మంది విద్యార్థులు సంస్కృతాన్ని అభ్యసిస్తూ, సాంస్కృతిక సంపదను కాపాడుతున్నారని సీఎం వెల్లడించారు. సంస్కృత భాషకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మరిన్ని పాఠశాలలు మరియు సంస్థలు నెలకొల్పాలన్నారు. భవిష్యత్తులో సంస్కృతాన్ని కేవలం భాషగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంభాషణ మాధ్యమంగా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications