యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2024 కు సంబంధించి 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ వంటి దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టుల భర్తీకీ ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఏప్రిల్ 24 నుంచి మే 14 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. కేవలం డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 4న రాతపరీక్ష జరగనుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం పది గంటల నుంచి 12 గంటలవరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునేవాళ్లు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి...
ఖాళీల సంఖ్య: 506 పోస్టులు
బీఎస్‌ఎఫ్ మొత్తం పోస్టులు : 186
సీఆర్‌పీఎఫ్ మొత్తం పోస్టులు : 120
సీఐఎస్‌ఎఫ్ మొత్తం పోస్టులు: 100
ఐటీబీపీ మొత్తం పోస్టులు : 58
సశస్త్ర సీమాబల్ మొత్తం పోస్టులు : 42
వయసు : 01.08.2024 నాటికి 20 - 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
దరఖాస్తు రుసుము : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
రెండు పేపర్లు..
మొత్తం 450 మార్కులకు ఈ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1
జనరల్ ఎబిలిటీ & ఇంటెలిజెన్స్‌కు 250 మార్కులు ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
పేపర్-2
జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌కు 200 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో వ్యాసం రాయాల్సి ఉంటుంది. అయితే ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, ఇతర కమ్యూనికేషన్స్/లాంగ్వేజ్ స్కిల్ మాత్రం ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications