వెయ్యి కోట్ల ఆస్తి.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే ?
హాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఏంజెలీనా జోలీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరని అందం, యవ్వనంతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన వ్యక్తిగత జీవితం, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఒక నటిగానే కాకుండా దర్శకురాలిగా, మానవతావాదిగా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పటికే ఒక ఆస్కార్ అవార్డు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సైతం అందుకున్నారు.
సినీ కెరీర్..
1982లో చిన్న వయసులోనే 'లుకిన్' టు గెట్ అవుట్' చిత్రంలో కనిపించి మెప్పించింది. కాగా ఏంజెలీనాకు అసలైన బ్రేక్ 1998లో వచ్చిన 'జియా' బయోగ్రఫికల్ డ్రామాతో లభించింది. ఆ తర్వా, 1999లో 'గర్ల్ ఇంటరప్టెడ్' సినిమాతో ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో ఆమె కెరీర్ కీలక మలుపు తిరిగింది. ఆ తర్వాత 2001లో వచ్చిన 'లారా క్రాఫ్ట్: టాంబ్ రైడర్' ఫ్రాంచైజ్‌తో ఏంజెలీనా యాక్షన్ క్వీన్‌గా గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత 'మిస్టర్ & మిసెస్ స్మిత్', 'వాంటెడ్', 'సాల్ట్' వంటి యాక్షన్ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు.

కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, 'చేంజెలింగ్' (2008) వంటి ఎమోషనల్ డ్రామాలలో తల్లి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే డిస్నీ క్లాసిక్ విలన్‌గా 'మాలిఫిసెంట్' (2014, 2019) సిరీస్‌లో నటించి తన నటనతో పాత్రకు ప్రాణం పోశారు. ఇక 2021లో మార్వెల్ సినిమా 'ఎటర్నల్స్'లో 'థీనా' పాత్రతో అదరగొట్టారు. నటిగానే కాకుండా ఏంజెలీనా దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. 'ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ' (2011), 'అన్‌బ్రోకెన్' (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రశంసలు అందుకున్నారు.
నాలుగు పెళ్లిళ్లు..
అయితే ఏంజెలీనా జోలీ వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అని చెప్పాలి. ఆమె ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నారు.
జానీ లీ మిల్లర్ (1996-1999): 'హ్యాకర్స్' మూవీ సెట్‌లో కలిసిన వీరి పెళ్లి అప్పట్లో సంచలనమైంది.
బిల్లీ బాబ్ థోర్న్‌టన్ (2000-2003): 'పుషింగ్ టిన్' షూటింగ్‌లో పరిచయం అయిన తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు.
బ్రాడ్ పిట్ (2014-2016): 'మిస్టర్ & మిసెస్ స్మిత్' సినిమాతో మొదలైన వీరి ప్రేమకథ హాలీవుడ్‌లో అతిపెద్ద టాక్ అయింది. 2014లో పెళ్లి చేసుకున్నప్పటికీ, 2016లో బ్రాడ్ తన పిల్లలపై దురుసుగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో విడాకుల ప్రక్రియ మొదలైంది. ఇది హాలీవుడ్‌లో అతిపెద్ద వివాదంగా మారింది. దర్యాప్తుల తర్వాత విడాకులు 2019లో ఫైనల్ అయ్యాయి.
నాలుగో వివాహం: 2024లో బ్రాడ్ పిట్‌తో మరోసారి పెళ్లి చేసుకున్నప్పటికీ, ఏడాదిలోనే విడిపోయారనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి.

ఆస్తులు..
ప్రస్తుతం ఏంజెలీనా జోలీ ఆస్తి విలువ దాదాపు రూ.1009 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఫోర్బ్స్ ఆమెను పలుమార్లు పేర్కొంది. లగ్జరీ విల్లాలు, కార్లు, హై-ఎండ్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications