అక్కినేని ఫ్యామిలీలో కొత్త లవ్ స్టోరీ
సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. రెండున్నర సంవత్సరాల క్రితమే వారిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ వారిద్దరి గురించే చర్చ నడుస్తుంటుంది. నెటిజన్లు దీనిపై డిబేట్ జరుపుతుంటారు. కొందరేమో సమంతది తప్పంటే.. మరికొందరు మాత్రం నాగచైతన్యది తప్పంటారు.. చివరగా మాత్రం ఇద్దరూ కలిసివుంటేనే బాగుంటుందనే అంగీకారానికి వచ్చి చర్చ ముగిస్తుంటారు.
మన్మథుడు నాగార్జున-అమల మళ్లీ హనీమూన్ కు వెళ్ళబోతున్నారంట. కొద్దిరోజులు ఫారిన్ ట్రిప్ వేయాలని, ప్రస్తుతం ఇక్కడున్న సమస్యలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకు నాగచైతన్య, అఖిల్ ఇద్దరు సంతానం. నాగచైతన్య తర్వాత అఖిల్ కు వివాహం చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా అఖిల్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రావడం అనేది గగన కుసుమమైపోయింది. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేయాలంటూ నాగార్జున-అమల దంపతులపై బంధువులు ఒత్తిడి చేస్తున్నారు.

నాగార్జున-అమలు హనీమూన్ కు వెళ్లబోతున్నారే వార్త తెలిసిన వెంటనే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీలో మరో కొత్త లవ్ స్టోరీ మొదలైందని, తండ్రి రొమాన్స్ ముందు నాగచైతన్య-అఖిల్ దేనికీ పనికిరారంటూ కొందరు కౌంటర్స్ వేస్తున్నారు. నాగార్జున ఫారిన్ ట్రిప్ వెళ్లడం సరైన నిర్ణయమేనని, ఎవరైనాసరే ఉన్న వాతావరణం నుంచి పదిరోజులు వేరే ప్రాంతంలో రిలాక్స్ అవుదానుకుంటారని, ఇది సహజంగా జరిగేదే అని, అందులో తప్పు పట్టాల్సిన పనేమీలేదని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నాగార్జున-అమల ఫారిన్ ట్రిప్ మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన అంశంగా మారిపోయింది.












Click it and Unblock the Notifications