సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మృతి..
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ డైరెక్టర్ సంగీత్ శివన్ బుధవారం మృతిచెందారు. ఆయన బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించారు. సంగీత్ శివన్ మళయాళ సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆయన అనేక చిత్రాలు నిర్మించారు. సంగీత్ రఘువరన్ నటించిన వ్యూహం (1990)తో సంగీత్ శివన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆరంగ్రేటం చేశారు. సంగీత్ శివన్ 65 ఏళ్ల వయసులోనే మృతిచెందారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖలు సంతాపం ప్రకటించారు. అయితే, సంగీత్ శివన్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంంది..
సంగీత్ శివన్ బాలీవుడ్‌కి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. సంగీత శివన్ 'క్యా కూల్ హై హమ్', 'అప్నా సప్నా మనీ మనీ' వంటి కామెడీ సినిమాలతో మంచి పేరు సంపాదించారు. ఇప్పుడ ఆయన మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సంగీత్ శివన్ మృతిపట్ల బాలీవుడ్ స్టార్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ సంతాపం వ్యక్తం చేశారు. రితేష్ దేశ్‌ముఖ్ ఇన్‌స్టా లోని తన ఖాతాలో ఆయన ఫోటోన్ షేర్ చేస్తూ ఎమోషన్‌ల్ పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోను చూసిన ప్రముఖులు, సినీ ప్రేమికులు ఆయనకు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

బాలీవుడ్‌లో అనేక చిత్రాలు..
మొదటగా మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. సన్నీడియోల్ నటించిన 'జూర్' సినిమాతో బాలీవుడ్‌లో ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ చిత్రం 1997లో రిలీజయ్యింది. ఆ తర్వాత ఆయన బాలీవుడ్‌లో అనేక చిత్రాలు తీసారు. సంధ్య, చురలియా హై తుమ్నే, క్యా కూల్ హై తుమ్, అప్నా సప్నా మణి మణి, ఏక్ - ది పవర్ ఆఫ్ వన్, క్లిక్ మరియు యమ్లా పగ్లా దీవానా 2 అనే హిందీ చిత్రాలకు సంగీత శివన్ దర్శకత్వం వహించాడు. సంగీత్ శివన్ మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు సినీ తారలందరూ సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications