బ్యాన్ చేసినా తగ్గేదేలే.. దెబ్బకు పాక్‌లో నెట్‌ఫ్లిక్స్ క్రాష్!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'ధురంధర్ 2: ద రివెంజ్' ప్రస్తుతం మరో అంతర్జాతీయ రికార్డును నెలకొల్పింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమాపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ.. అక్కడ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ సరికొత్త తుఫాన్ సృష్టిస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మావియా ఉమేర్ ఫారూఖీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్ హోమ్ పేజీలో 'ధురంధర్ 2' టాప్-1లో ఉన్న స్క్రీన్‌ను చూపిస్తూ ఆయన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన మొదటి 24 గంటల్లోనే దాదాపు 20 కోట్ల మంది పాకిస్తానీయులు దీనిని వీక్షించారని ఆయన పేర్కొన్నారు. గతంలో 'మనీ హైస్ట్', 'స్క్విడ్ గేమ్' సిరీస్‌లకు మాత్రమే పాకిస్తాన్‌లో ఈ స్థాయి క్రేజ్ ఉండేదని.. ఇప్పుడు ఆ రికార్డులను 'ధురంధర్ 2' బద్దలు కొట్టిందని ఆయన వివరించారు.

సినిమాలోని రణ్‌వీర్ సింగ్ పాత్ర, భారత్-పాక్ సరిహద్దు కథాంశంపై పాకిస్థాన్ లో తొలుత వ్యతిరేకత వచ్చినప్పటికీ.. దర్శకుడు ఆదిత్య ధర్ స్క్రీన్ ప్లే, టేకింగ్‌కు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చిత్రం విడుదలైన మొదటి రోజే నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్ అయ్యేలా పాక్ నెటిజన్లు ఈ సినిమాపై విరుచుకుపడ్డారని సమాచారం. కాగా ఈ చిత్రం భారతదేశంలో జూన్ 4 నుంచి జియోహాట్‌స్టార్ వేదికగా ప్రీమియర్ కానుంది. ఆ తర్వాత జూన్ 5 నుంచి పూర్తి స్థాయిలో స్ట్రీమింగ్ కాబోతోంది. నిషేధాలు దాటుకుని మరీ పాకిస్తాన్‌లో ఈ భారతీయ సినిమా నంబర్ 1 స్థానంలో నిలవడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications