మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేసిన రాజశేఖర్.. కానీ ఈసారి పాజిటివ్ గానే !!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్. నటుడిగా మాత్రమే కాకుండా వైద్యుడిగా కూడా అరుదైన ప్రయాణం చేసిన వ్యక్తి. 1962 ఫిబ్రవరి 4న జన్మించిన ఆయన, చెన్నైలో ఎంబీబీఎస్ పూర్తి చేసినప్పటికీ, తన ఆసక్తి సినిమాలవైపు మళ్లింది. వైద్య వృత్తిని వదిలి 1980ల చివర్లో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి.. తొలి దశలో విలన్, సపోర్టింగ్ పాత్రలు పోషించిన తర్వాత పూర్తి స్థాయి హీరోగా ఎదిగారు.

కాగా హీరోగా మారిన తర్వాత రాజశేఖర్ యాక్షన్ ఇమేజ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. పోలీస్, ఆర్మీ ఆఫీసర్ వంటి పాత్రల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. Ankusham, Allari Priyudu, Simha Raasi, Gorintaku, Evadaithe Nakenti వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. యాక్షన్‌తో పాటు కుటుంబ కథా చిత్రాల్లోనూ తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. అయితే కెరీర్‌లో మధ్యలో కొన్ని పరాజయాలు ఆయనకు ఎదురయ్యాయి.

actor-dr-rajashekhar-opens-about-miss-chance-to-act-in-tagore-movie-and-chiranjeevi-goes-viral

ఈ దశలో హీరోగా అవకాశాలు తగ్గినా 2017లో వచ్చిన PSV Garuda Vega చిత్రంతో రాజశేఖర్ ఘనంగా రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆయనకు కొత్త ఊపిరి పోసింది. ఆ తర్వాత Kalkiతో మరో హిట్ అందుకుని, Shekarలో మానసిక వైద్యుడిగా భిన్నమైన పాత్రలో కనిపించారు. ఇటీవలి కాలంలో రాజశేఖర్ తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కూడా ఓపెన్ అయ్యారు. నితిన్ నటించిన సినిమాలో కీలక పాత్ర పోషించినా ఆ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ Bikerలో హీరో తండ్రి పాత్రలో కనిపించి తన నటనతో మళ్లీ ఆకట్టుకున్నారు.

ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన కెరీర్‌ గురించి, అవకాశాలను కోల్పోయిన విషయాన్ని గురించి కూడా ఓపెన్ అయ్యారు. ముఖ్యంగా Tagore, Chanti, Gentleman వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తనకు వచ్చినప్పటికీ, అనివార్య కారణాలతో వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే 'ఠాగూర్' సినిమా రీమేక్ రైట్స్ వివాదం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య విభేదాలు రావడానికి ఇదే కారణమని చెప్పుకునేవారు. రాజశేఖర్ సైతం పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

అంతే కాకుండా చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టిన తరువాత, ఆయనపై జీవితా రాజశేఖర్ దంపతులు తీవ్ర విమర్శలు చేశారు. ఆ టైంలోనే రాజశేఖర్ తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న కారుపై మెగా అభిమానులు రాళ్ల దాడి చేశారు. పరిస్థితి మరింత సీరియస్‌ గా మారడంతో చిరంజీవి స్వయంగా రాజశేఖర్‌ ఇంటికి వెళ్లి, తన ఫ్యాన్స్ చేసిన దానికి వారి ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. అప్పటికి సర్దుకు పోయినట్టుగా కనిపించినా, ఏదొక సందర్భంలో ఈ వివాదం తెర మీదకు వస్తూనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+