సినిమాల్లో నటించను.. మళ్లీ అప్పుడే - జయం రవి

తమిళ సినీ పరిశ్రమలో తనదైన నటన, వైవిధ్యమైన కథల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో జయం రవి. ఇటీవల తన పేరును ఇకపై "రవి మోహన్"గా పిలవాలని అధికారికంగా ప్రకటించారు. అయితే గత ఏడాది తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. దాదాపు ఎన్నో ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తీసుకున్న ఈ నిర్ణయం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో రవిపై విమర్శలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సింగర్ కెనీషాతో రవి మోహన్ రిలేషన్‌లో ఉన్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లలో కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దర్శకుడు గణేష్ కుమార్తె వివాహ వేడుకకు రవి మోహన్, కెనీషా కలిసి హాజరుకావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రత్యేక బంధం ఉందా? అన్న చర్చ మరింత వేడెక్కింది.

actor-jayam-ravi-alias-ravi-mohan-shocking-statement-that-no-more-acting-in-movies-until-get-divorce

కానీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కెనీషా చేసిన సుదీర్ఘ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన జీవితంలో జరిగిన పరిణామాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. ఈ కథలోకి ఎంతో ప్రేమతో వచ్చానని, కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుదిరుగుతున్నానని రాసుకొచ్చారు. ఈ ప్రపంచం నిజాలను కాదు, భావోద్వేగాలతో అల్లిన కథలనే నమ్ముతుంది" అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అతడిని ప్రేమించే వారికి, అతడి జీవితంపై హక్కులు ఉన్నాయని భావించే వారికి నేను చెప్పేది ఒక్కటే.. అతడు ఇక పూర్తిగా మీవాడే. ఇక నేను యుద్ధాలు చేయలేను. మంచి వ్యక్తులకు అండగా నిలబడాలని అనుకోవడం నా అమాయకత్వం" అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే నటుడు జయం రవి కూడా మెడ సమావేశం నిర్వహించి తన వ్యక్తిగత విషయాలపై తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. ఎన్నో రోజులుగా సహనంతో ఉన్నానని, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.తన పిల్లలకు కూడా తనను దూరం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతకాలం తన వ్యక్తిగత జీవితాన్ని మీతో పంచుకోనందుకు క్షమించండి. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. విడాకులు వచ్చే వరకూ నా సినిమాలు ఏవీ విడుదల కావు. అప్పటి వరకూ నేను కూడా నటించలేను. నాకు జరిగిన అవమానాలు ఇక భరించడం నా వల్ల కాదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఆపేవరకూ నేను నటించలేను. ఆఫీసులోనే ఉంటాను. రండి.. ఎంతగా ఇబ్బందిపెడతారో పెట్టండి. ఇకపై నేను మౌనంగా ఉండాలని అనుకోవడం లేదు" అని స్పష్టం చేశారు.

అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్‌ను ప్రస్తావిస్తూ.. "నాకు విడాకులు వస్తాయా.. రావా అనేది పక్కన పెడితే నాపై జరుగుతోన్న ట్రోలింగ్ నన్ను బాధిస్తోంది. నా కెరీర్‌లో 95 శాతం చిత్రాలు హిట్‌. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశా. అలాంటి నాపై ఎన్ని నిందలు వేస్తున్నారు" అని జయం రవి పేర్కొన్నారు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను లక్షలు పెట్టివాళ్లను చదివించాను. వాళ్లపై నాకున్న ప్రేమ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నాకు ప్రేమలేదని రాసేస్తున్నారు. అవి ఎంత బాధిస్తోయో మీకేం తెలుసు అని ఎమోషనల్ అయ్యారు.

ట్రోలింగ్ కారణంగానే తన స్నేహితురాలు కెనీషాను కోల్పోయానని, ఆమె తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారని జయం రవి తెలిపారు. తన వ్యక్తిగత జీవితంలోని అడ్డంకులు తొలగిపోయాక తప్పకుండా నటిస్తానని హామీ ఇచ్చారు. దానికి ఎంత సమయం పడుతుందో తెలియకున్నా అంతా మంచే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+