కరెంటు బిల్లు కారణంతో తల్లికి వందనం రాలేదా? ఇలా దరఖాస్తు చేస్తే..!

ఏపీలో కూటమి సర్కార్ (AP Govt) ఈ ఏడాదికి పాఠశాలలకు వెళ్లే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం (Talliki Vandanam) నిధుల్ని ఈ నెలలో జమ చేసింది. అయితే ఇంకా పలు చోట్ల విద్యార్ధుల తల్లులకు వివిధ కారణాలతో డబ్బులు అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో ప్రధాన కారణం కరెంటు బిల్లు. తల్లికి వందనం డబ్బులకు అర్హతగా కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్ల లోపే ఉండాలనే అర్హత ఉంది. కానీ ఈ ఏడాది వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగి భారీ కరెంటు బిల్లులు రావడంతో చాలా మంది ఈ పథకానికి అనర్హులు అయ్యారు.

తల్లికి వందనంలో ట్విస్ట్..! డ్వాక్రా మహిళలకు బ్యాంకుల షాక్?
తల్లికి వందనంలో ట్విస్ట్..! డ్వాక్రా మహిళలకు బ్యాంకుల షాక్?

ఇలాంటి వారు తిరిగి సచివాలయాల్లో తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి అర్హులైతే నిధుల్ని వచ్చే నెలలో జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం పెడుతున్న షరతు గత 12 నెలల కరెంటు బిల్లు సగటు చూస్తే నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. దాటితే మాత్రం తల్లికి వందనం పథకం డబ్బులు రావు. మధ్యలో ఒకటి, రెండు నెలలు పెరిగినా 12 నెలల సగటు చూసినప్పుడు మాత్రం అధి 300 యూనిట్ల కన్నా తక్కువగా ఉండాలి. అప్పుడే డబ్బులు జమ అవుతాయి.

Talliki Vandanam Scheme High Electricity Bill Reason Eligibility How to Apply amp amp Required Documents
తల్లికి వందనం అందని వారికి మరో ఛాన్స్ - తాజా షెడ్యూల్ ప్రకటన..!
తల్లికి వందనం అందని వారికి మరో ఛాన్స్ - తాజా షెడ్యూల్ ప్రకటన..!

ముందుగా ఈసారి డబ్బులు అందని వారు ఈ కరెంటు బిల్లు లెక్క చూసుకుని, నెలకు 300 యూనిట్ల లోపు గత 12 నెలల సగటు ఉంటే సచివాలయానికి వెళ్లి తమకు తల్లికి వందనం పథకం రాలేదని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం గత 12 నెలల కరెంటు బిల్లుల రసీదులు, ఆధార్ కార్డు, కుటుంబం పేరు మీద మొత్తం ఎన్ని విద్యుత్ మీటర్లు ఉన్నాయి, ఉంటే అవి ఎవరెవరి పేర్లతో ఉన్నాయి వంటి ఆధారాలను కూడా తీసుకెళ్లాలి. అందుబాటులో ఉంటే మీటర్ నంబర్లు కూడా ఇవ్వాలి. అప్పుడు అధికారులు నిబంధనల ప్రకారం ఆధారాలను పరిశీలించి అర్హులైతే తల్లికి వందనం డబ్బులు జమ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. అప్పుడు ప్రభుత్వం ఈ నిధుల్ని వారి ఖాతాల్లో వచ్చే నెలలో జమ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+