Abhijeet Dipke: బీజేపీలో చేరకపోతే బెదిరింపులా? ప్రహ్లాద్ జోషీ, రాందేవ్ పైనా అభిజీత్ దిప్కే అటాక్..!
నీట్ పరీక్షల అక్రమాలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాల ద్వారా దాన్ని సాధించుకున్న సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఇవాళ కేంద్రంపై నిప్పులు చెరిగారు. విద్యార్ధుల కోసం తాను ఉద్యమం చేస్తున్న బీజేపీలో చేరాలని తనకు పలు ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆ పార్టీలో చేరి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని బెదిరింపులు వచ్చినట్లు దిప్కే ఛత్రపతి శంభాజీనగర్‌లో వెల్లడించారు.
దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఒక విద్యార్థిని భయపెట్టేందుకు ఇలాంటి మార్గాలను ఎంచుకోవడం సిగ్గుచేటని అభిజీత్ దిప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం కోసం, విద్యార్థుల హక్కుల కోసం, మెరుగైన విద్యావ్యవస్థ కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టి పోరాడుతున్న తరాన్ని బెదిరించడం సరైన పద్ధతి కాదని బీజేపీ నేతలకు హితవు పలికారు. ప్రశ్నిస్తే సంస్కృతి నిలుస్తుందే తప్ప సమాజం నాశనం కాదన్నారు.

మరోవైపు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై కూడా దిప్కే తీవ్ర విమర్శలు గుప్పించారు. యువతకు రాజకీయం లేదా సంస్కృతిపై సలహాలు ఇవ్వడం మానేసి, పతంజలి ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవాలని సూచించారు. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశ భవిష్యత్తును నిలబెట్టే సత్తా నేటి యువతకు ఉందని, రామ్‌దేవ్ తన వ్యాపారం కోలుకునేలా చూసుకోవడం మంచిదన్నారు. అలాగే ఆందోళనల వేళ విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలోనే పనిచేస్తారన్న విషయాన్ని గుర్తుచేశారు. కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని ఉద్దేశించి.. నేరగాళ్లకు, అత్యాచార నిందితులకు మద్దతు ఇచ్చే వ్యక్తులకు ఈ ప్రభుత్వంలో చోటు దక్కుతోందని దిప్కే ఆరోపించారు.














Click it and Unblock the Notifications