మోదీ చెప్పినా తగ్గేదేలే.. బంగారం కొనుగోళ్లలో భారత్ నయా రికార్డు!

భారతీయులకు పసిడిపై ఉన్న మమకారం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధరలు ఆకాశాన్నంటి రికార్డు స్థాయికి చేరినా సరే, మేలిమి డిజైన్లను సొంతం చేసుకోవడంలో గానీ, భవిష్యత్ పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయడంలో గానీ భారతీయులు ఎప్పుడూ వెనుకంజ వేయరు. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన 2026 రెండో త్రైమాసికం (ఏప్రిల్ - జూన్) నివేదిక ఈ విషయాన్ని మరోసారి ఘనంగా చాటిచెప్పింది. గతేడాదితో పోలిస్తే భారతీయులు కొనుగోలు చేసిన బంగారం బరువు తగ్గినా, దానికి వెచ్చించిన సొమ్ము మాత్రం ఏకంగా 50 శాతం పెరగడం విశేషం.

పరిమాణం తగ్గినా.. భారం పెరిగింది!

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాల ప్రకారం.. 2025 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు 139.7 టన్నుల బంగారం కొనుగోలు చేయగా, 2026 నాటి అదే సమయానికి ఇది 131.4 టన్నులకు పడిపోయింది. అంటే కొనుగోలు చేసిన పసిడి పరిమాణం 6 శాతం (సుమారు 8.3 టన్నులు) తగ్గింది. కానీ ధరలు పెరగడం వల్ల ఈ బంగారం విలువ ఏకంగా రూ. 1,32,500 కోట్ల నుంచి ఒక్కసారిగా రూ. 1,98,100 కోట్లకు చేరింది. అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే మనవాళ్లు అదనంగా రూ. 65,600 కోట్లు పసిడిపై వెచ్చించారు.

Gold Demand India 2026 Indians Spent Extra Rs 65 600 Crore on Gold Despite Buying Fewer Tonnes
విరుచుకుపడ్డ బంగారం ధరలు! భగ్గుమన్న వెండి
విరుచుకుపడ్డ బంగారం ధరలు! భగ్గుమన్న వెండి

ఆభరణాల మెరుపు కొంచెం తగ్గినా.. ఇన్వెస్ట్‌మెంట్ హిట్!

పెరిగిన ధరల దెబ్బ ఆభరణాల విక్రయాలపై స్పష్టంగా కనిపించింది. పసిడి నగలు కొనేవారు తక్కువ బరువు, తక్కువ క్యారెట్ల నగల వైపు మొగ్గు చూపడం లేదా పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ప్రారంభించారు. దీంతో నగలకు సంబంధించి పసిడి కొనుగోలు బరువు 88.8 టన్నుల నుంచి 75.1 టన్నులకు (15 శాతం) తగ్గింది. అయితే నగలకు పెట్టిన వ్యయం మాత్రం రూ. 84,200 కోట్ల నుంచి రూ. 1,13,210 కోట్లకు (34 శాతం పెరిగి) ఎగబాకింది. మరోవైపు బిస్కెట్లు, నాణేల రూపంలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య 9 శాతం పెరిగి 50.3 టన్నులకు చేరగా, డిజిటల్ బంగారం లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి (ETFs) ఏకంగా 136 శాతం గరిష్ఠ విలువ పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది.

పసిడి పుట్టుక ఎలాగో తెలుసా? సైంటిస్టులు కనిపెట్టిన రహస్య
పసిడి పుట్టుక ఎలాగో తెలుసా? సైంటిస్టులు కనిపెట్టిన రహస్య

పండుగల సీజన్‌లో కొనుగోళ్లు మరింత జోరు!

భారతీయులు తమ ఆర్థిక భద్రత కోసం బంగారాన్ని అత్యంత సురక్షితమైన మార్గంగా భావిస్తారని నివేదిక స్పష్టం చేస్తోంది. రాబోయే పండుగలు, వివాహాల సీజన్లలో బంగారం డిమాండ్ మరింత ఊపందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఈ ఏడాది మొత్తానికి భారతదేశంలో పసిడి వినియోగం 650 నుంచి 750 టన్నుల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+