రాజేంద్రప్రసాద్.. బూతుల ప్రసాద్‌గా పేరు మార్చుకో..!
ప్రముఖ సీనియర్ నటుడు, "నటకిరీటి" రాజేంద్రప్రసాద్ మరోసారి తన మాటలతో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా సహనటుడు ఆలీని ఉద్దేశించి వాడిన పదజాలం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజేంద్రప్రసాద్‌పై ప్రజల్లో, ముఖ్యంగా సినీ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్రప్రసాద్, మైక్ అందుకుని ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో స్పష్టంగా కనిపించిన దాని ప్రకారం, ఆయన తన ప్రసంగాన్ని "మీరందరూ వస్తున్నారని నాకు చెప్పలేదు, రాకుంటే నేను మిస్ అయ్యే వాడిని. ఏరా అచ్చన్న (నిర్మాత అచ్చిరెడ్డి)... బయటికి రా నీ సంగతి చూస్తా" అంటూ మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా, "మా ఇద్దరికీ ఇది అలవాటే" అని చెబుతూ, "ఇక ఆలీగాడు ఎక్కడ ఉన్నాడు లం*కొడుకు.. ఇదంతా మనకు కామనే" అంటూ సహనటుడు ఆలీని ఉద్దేశించి తీవ్రమైన పదజాలం వాడినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

రాజేంద్రప్రసాద్ కేవలం ఆలీపైనే కాకుండా, సభలోని ప్రేక్షకులపైనా తన అసహనం వ్యక్తం చేశారు. తాను అంతకుముందు రోజు ఎన్టీఆర్ అవార్డు అందుకున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో, "ఏంటి మీరు చప్పట్లు కొట్టరా?" అని ప్రశ్నించి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. అక్కడున్న వారిని ఉద్దేశించి, "మీ అందరికీ బ్రెయిన్ పోయిందా?" అని, చప్పట్లు కొట్టకపోతే "సిగ్గు లేనట్టే" అంటూ మరికొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నటుడిగా, బహిరంగ సభలో ఇలాంటి భాషను వాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రప్రసాద్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నటుడై ఉండి, బహిరంగ వేదికపై ఇలాంటి భాష వాడటం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు. గతంలో కూడా రాజేంద్రప్రసాద్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారని గుర్తుచేస్తున్నారు. నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' చిత్ర ప్రచారంలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను దూషించి, ఆ తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొని క్షమాపణలు చెప్పిన ఉదంతాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆలీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన "నోటి దురుసు" గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆలీ, రాజేంద్రప్రసాద్ మధ్య దశాబ్దాల స్నేహం ఉంది. ఆలీ తన పలు సందర్భాల్లో రాజేంద్రప్రసాద్‌ను తన గురువుగా, మార్గదర్శకుడిగా పేర్కొన్నారు. అలాంటి స్నేహితుడిని బహిరంగ సభలో తీవ్రమైన పదజాలంతో దూషించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది స్నేహపూరితమైన సరదా కాదని, అగౌరవపరిచే విధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. రాజేంద్రప్రసాద్ తన పేరును బూతుల ప్రసాద్‌గా మార్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.ఈ వరుస వివాదాలు ఆయన ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications