ఆ బాధతో మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ
గత కొంతకాలంగా తన రాజకీయ విశ్లేషణలు, వ్యక్తిగత కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న నటుడు శివాజీ.. తాజాగా మహిళల వస్త్రధారణపై తను గతంలో చేసిన కామెంట్ల వల్ల తలెత్తిన వివాదంపై స్పంధించారు. ఆ సమయంలో తను ఎదుర్కొన్న విమర్శలు, తనపై వచ్చిన పోలీసు ఫిర్యాదుల నేపథ్యంలో కలిగిన మానసిక వేదనను ఆయన ఓ ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా వివరించారు. ముఖ్యంగా ఆ వివాదం తన వ్యక్తిత్వాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో ఆయన ఆవేదనతో పంచుకున్నారు.
ఆ పదాలు ఎందుకు వాడానో నాకే తెలియదు..
సాధారణంగా శివాజీ బహిరంగ చర్చల్లో తన వాదనను బలంగా వినిపిస్తుంటారు. అయితే మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ విషయంలో తాను పొరపాటు పడ్డానని ఆయన అంగీకరించారు. "నేను గతంలో ఎన్నో ప్రెస్ మీట్లు, చర్చల్లో పాల్గొన్నాను. ఎప్పుడూ నా మాటపై నాకు నియంత్రణ కోల్పోలేదు. కానీ ఆ రోజు ఆ రెండు పదాలు ఎందుకు వాడానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అసలు నా నోటి నుంచి ఆ మాటలు ఎలా వచ్చాయా? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నిజానికి మహిళలను వారు ధరించే దుస్తుల ఆధారంగా తక్కువ చేసి చూడకూడదని నేను బలంగా నమ్ముతాను" అని శివాజీ చెప్పుకొచ్చారు.

తీవ్ర మానసిక ఒత్తిడి.. నిద్రలేని రాత్రులు
ఆ వివాదం రాజుకున్న తర్వాత తాను అనుభవించిన నరకాన్ని శివాజీ బయటపెట్టారు. ఆ కామెంట్స్ వల్ల తలెత్తిన దుమారం తనను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసిందని.. దాదాపు మూడు రోజుల పాటు తనకు నిద్ర కూడా పట్టలేదని వెల్లడించారు. తాను వాడిన పదాలు ఎవరినైనా నొప్పించాయా అన్న బాధ తనను వెంటాడిందని, ఏరోజూ ఇలాంటి స్థితిని ఎదుర్కోలేదని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మహిళల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, ఆ ఘటన ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనసూయపై విమర్శల ప్రచారంలో నిజం లేదు..
ఈ క్రమంలోనే నటి అనసూయ భరద్వాజ్‌ను శివాజీ టార్గెట్ చేశారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. అనసూయ గురించి తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా తప్పుగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. "ఆమెతో నాకు అంతగా పరిచయం కూడా లేదు. ఆమె ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ఆమె పట్ల నాకు గౌరవం ఉంది. పురుషులు సాధారణంగా మహిళలను ఉద్దేశపూర్వకంగా అవమానించాలని చూడరని నా అభిప్రాయం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు" అని ఆయన కోరారు.
మహిళా కమిషన్ విచారణలో షాకింగ్ నిజం
ఈ వివాదం మహిళా కమిషన్ వరకు వెళ్ళినప్పుడు తనకు ఎదురైన ఓ విచిత్రమైన అనుభవాన్ని శివాజీ ఈ సందర్భంగా పంచుకున్నారు. తనపై ఫిర్యాదు చేసిన వారి జాబితా చూసి తాను ఆశ్చర్యపోయానని.. అందులో తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు, తనకు బాగా తెలిసిన వారే ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే వారి పేర్లను బయటపెట్టి వివాదాన్ని పెద్దది చేయదలుచుకోలేదని, వారి పట్ల తనకున్న గౌరవం కారణంగా ఆ పేర్లను రహస్యంగానే ఉంచుతున్నానని చెప్పారు. ఈ క్లారిఫికేషన్‌తో ఆ వివాదానికి ఇకనైనా ఫుల్‌స్టాప్ పడుతుందని ఆయన ఆశిస్తున్నారు.
-
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు












Click it and Unblock the Notifications