తెలుగులో మరో నరేష్-పవిత్రా లోకేష్ జంట
తెలుగులో సీనియర్ నటీనటులైన నరేష్-పవిత్రా లోకేష్ జంట గురించి దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా తర్వాత అంతగా పాపులర్ అయ్యారు వీరిద్దరూ. నడివయసులో ప్రేమించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, కొత్తగా ప్రేమలో ఉన్న యువతీ యువకుల్లా ప్రవర్తించడం, నరేష్ మూడో భార్యతో వివాదం, కోర్టులో కేసులు... ఇలాంటి సంఘటలన్నీ వీరికి మంచి పాపులారిటీని అందించాయి. ప్రస్తుతం పెళ్లిచేసుకోకపోయినప్పటికీ సహజీవనం చేస్తున్న ఈ జంటలాగానే తెలుగు సినీ పరిశ్రమలో మరో జంట తెరపైకి వచ్చింది. వారెవరో కాదు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, నటి జ్యోతి.
వైరలవుతున్న పోస్ట్
శ్రీకాంత్ అయ్యంగార్ 54 సంవత్సరాల వయసులో పెళ్లి ప్రకటన చేస్తూ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ షేర్ చేశారు. తనకు నటి జ్యోతి ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో 'క్రష్ ఆఫ్ మై లైఫ్. మీ దేవుళ్లు మాకు పెళ్లి(marriage) చేయాలనుకుంటున్నారా?' అని రాసుకొచ్చారు. దీన్నిబట్టి త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోవడం ఖాయమని అర్థమవుతోందని నెటిజన్లు అంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోపాటు వివాదాస్పద పోస్టులు కూడా పెడుతూ శ్రీకాంత్ అయ్యంగార్ నిత్యం వార్తల్లో నిలుస్తారు.

విడాపోకుండా బంధాన్ని కొనసాగించండి
సినీ పరిశ్రమలో ఉన్న యువ హీరోలు పెళ్లిళ్లు చేసుకోకుండా కెరీర్ పై దృష్టిపెడుతూ వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటివారు మధ్య వయసులో ప్రేమలు, పెళ్లిళ్లు అంటున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత తోడు అనేది ఎంత అవసరమో దీన్ని బట్టి అర్థమవుతోందని, అందుకే అందరూ యువకులుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్లి చేసుకోవడంలో తప్పులేదని, వారిద్దరూ విడిపోకుండా చిరకాలం బంధాన్ని కొనసాగిస్తే చాలని మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ వివాదాస్పద శ్రీకాంత్ అయ్యంగార్ త్వరలోనో ఓ ఇంటివారవుతున్నారనే వార్త మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఏది ఏమైనప్పటికీ తాను అనుకున్నదారిలోనే పయనిస్తాను అనే మనస్తత్వం ఆయనది. రామ్ గోపాల్ వర్మ తరహాలోనే వ్యవహరిస్తుంటారు.












Click it and Unblock the Notifications