అడివి శేష్ నన్ను ట్రై చేశాడు ..అందుకే దూరం పెట్టాను - అనసూయ(వీడియో)

నటి అనసూయ ఇటీవల కాలంలో సినిమాల్లో కన్నా వివాదాల్లోనే ఎక్కువుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ .. ఆ తరువాత యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా , హీరోయిన్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారామె. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

క్రేజ్‌తో పాటు వరుస వివాదాలు కూడా ఆమెను వెంటాడాయి. అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్లు ఘాటుగా స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదే సమయంలో అనసూయ ట్రోలింగ్ కూడా గురైయ్యారు. ఇటీవలే హీరోయిన్ అవకాశాలు గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ పాత్రలు రావాలంటే షూటింగ్ పూర్తయ్యాక జరిగే పార్టీలకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి అనసూయ సంచలనం సృష్టించింది. దీనిని మర్చిపోకముందే మరో బాంబు పేల్చింది.

Actress anasuya shocking comments on hero adivi sesh

ఓ ఇంటర్య్వూలో అనసూయ మాట్లాడుతూ.. హీరో అడివి శేషు తనకి లైన్ వేశాడని..అందుకే అతన్ని చాలా రోజులు దూరం పెట్టానని తెలిపింది. 2013 సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌తో కలిసి యూఎస్ టూర్‌కు వెళ్లానని..ఆ సమయంలో తనని అడవి శేష్ తనని అప్రోచ్ అయ్యాడని .. హీరోలందరూ లైన్ వేయడానికే అప్రోచ్ అవుతారని అనుకుని అడివి శేషుని దూరం పెట్టానని అనసూయ చెప్పుకొచ్చింది.

Actress anasuya shocking comments on hero adivi sesh

అయితే తరువాత ఆయన అలాంటి వ్యక్తి కాదని.. క్షణం సినిమాలో రోల్ కోసం అడివి శేషు తన దగ్గరకి వచ్చాడని అర్థం అయిందని అనసూయ వెల్లడించింది. అనసూయ చేసిన కామెంట్స్‌పై అడివి శేష్ ఇప్పటి వరకూ స్పందించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+