మాజీ భర్త ఆస్తి కోసం కోర్టుకెక్కిన స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. ఆమె మాజీ భర్త, సోనా కామ్‌స్టార్ చైర్మన్‌గా ఉన్న దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సంజయ్ మరణానంతరం ఆయన ఆస్తులపై వివాదం రేగింది. సంజయ్ - కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్.. తమ సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ కపూర్ నకిలీ వీలునామా సృష్టించి ఆస్తులను చేజిక్కించుకోవడానికి కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

2003లో కరిష్మా కపూర్, సంజయ్ కపూర్‌ల వివాహం జరిగింది. వారికి సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2014లో విడిపోవగా, 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం సంజయ్ - ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నారు.

actress-karishma-kapoor-kids-petition-on-court-over-sanjay-assets

ఈ ఏడాది జూన్ 12న బ్రిటన్‌లో పోలో ఆడుతున్న సమయంలో సంజయ్ కపూర్ ఆకస్మికంగా గుండెపోటుకు గురై మరణించారు. ప్రాథమిక విచారణలో ఆయన గొంతులోకి తేనేటీగ వెళ్లడం వల్ల మరణించి ఉండవచ్చని అధికారులు గుర్తించారు. మరణం అనంతరం లండన్‌లో జరిగిన అంత్యక్రియలకు ఆయన మాజీ భార్య కరిష్మా కపూర్ పిల్లలతో కలిసి హాజరయ్యారు.

ఆస్తులపై వివాదం..

కాగా సంజయ్ మరణం తర్వాత ఆస్తుల విషయంలో కుటుంబంలో విభేదాలు చెలరేగాయి. మొదట ప్రియా సచ్‌దేవ్ - "సంజయ్ ఎలాంటి వీలునామా రాయలేదు, అన్ని ఆస్తులు ఆర్‌కే ఫ్యామిలీ ట్రస్ట్ కింద ఉన్నాయి" అని చెప్పారని కరిష్మా కపూర్ ఆరోపిస్తున్నారు. కానీ ఆ తరువాత మార్చి 21 తేదీతో కూడిన ఒక వీలునామాను చూపించింది. ఈ పత్రంలో సంజయ్ కపూర్ దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను ప్రియాతో పాటు ఆమె అనుచరులకు కట్టబెట్టినట్లు చూపించారని వాపోతున్నారు. దీంతో సమైరా, కియాన్.. సదరు వీలునామా కుట్రపూరితంగా సృష్టించిన పత్రమని పేర్కొంటూ.. అసలు కాపీ తమకు ఎప్పుడూ చూపించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిల్లల కోర్టు పిటిషన్..

తమ తండ్రి బ్రతికున్నప్పుడు ఎప్పుడూ భవిష్యత్తుకు లోటు ఉండదని హామీ ఇచ్చారని అంటున్నారు. చదువుల కోసం, భవిష్యత్తు కోసం ప్రత్యేక వ్యాపార ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారని.. కానీ ఆయన మరణించిన వారం రోజుల్లోనే మమ్మల్ని ఆర్థిక విషయాలకు దూరం పెట్టారన్నారు. ఇప్పుడు నకిలీ వీలునామా సృష్టించి ఆస్తులను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తాము చట్టబద్ధమైన Class-1 వారసులు కాబట్టి తండ్రి ఆస్తిలో చెరో ఐదో వంతు వాటా ఇప్పించాలని.. కేసు తేలేవరకు ఆస్తిని అమ్మడం లేదా ఇతరుల పేర్లపై మార్చకుండా నిరోధించాలనీ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

కరిష్మా పిల్లల తరఫున ఆమె కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసులో ప్రతివాదులుగా ప్రియా కపూర్, ఆమె మైనర్ కుమారుడు, సంజయ్ తల్లి, అలాగే వీలునామా ఎగ్జిక్యూటర్‌గా చెప్పుకుంటున్న మరో మహిళ ఉన్నారు. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+