హీరోలతో పాటు సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలి.. ఆ విషయం జరిగితే !
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది " కీర్తి సురేష్ ". 2016లో రామ్ పోతినేని సరసన " నేను శైలజ " సినిమాతో తెలుగు ఓకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోలతో కీలక చిత్రాల్లో నటించిన కీర్తి, తన సహజ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మహానటి సినిమాతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈమె.. జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు సంపాదించుకుంది.
మహానటి తర్వాత పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించినా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మిస్ ఇండియా, పెంగ్విన్ వంటి వైవిధ్యమైన పాత్రల్లో కనిపించింది. దాంతో రూట్ మార్చిన కీర్తి.. మహేష్ బాబుతో కలిసి నటించిన " సర్కారు వారి పాట " మూవీలో గ్లామరస్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది. దసరా చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించగా, భోళా శంకర్ వంటి చిత్రాలు మాత్రం నిరాశ పరిచాయి. అంతే కాకుండా ప్రభాస్ కల్కి 2898 ADలో, ప్రభాస్ డ్రైవ్ చేస్తున్న బుజ్జి కార్‌కు కీర్తి వాయిస్ ఓవర్ ఇచ్చి అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

ప్రస్తుతం కీర్తి నటించిన లేటెస్ట్ చిత్రం ఉప్పు కప్పురంబు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇందులో ఆమె ఒక గ్రామాధికారిణిగా, శక్తిమంతమైన పాత్రలో కనిపించనుంది. సుహాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ట్రైలర్‌కు ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
హీరోలతో సమానంగా హీరోయిన్ లకు రెమ్యూనరేషన్..
తన విషయంలో మొదట కథే చాలా ముఖ్యమని.. పారితోషికాన్నికి చివరి ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. హీరోహీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ విషయం పై చర్చలు జరుగుతున్నాయని.. నిజం చెప్పాలంటే ఒక హీరో కోసం ప్రేక్షకులు ఎలా అయితే థియేటర్ కు వస్తున్నారో, అదే స్థాయిలో ఓ హీరోయిన్ కోసం కూడా ప్రేక్షకులు వస్తుంటే.. అప్పుడు హీరోయిన్ కి కూడా హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వొచ్చని వివరించింది.
రీసెంట్ గానే తన లవర్ ఆంటోనిని పెళ్లి చేసుకున్న ఈమె.. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం నానితో ఒక సినిమా చేస్తుండగా.. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications