మంచు లక్ష్మీకి వేధింపులు.. వేడుకున్నా కానీ..
సినీనటుడు మంచు మోహన్ బాబు కుమార్తె, నటి లక్ష్మీ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణ ప్రక్రియలో పారదర్శకత లోపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. తన బ్యాగు తనిఖీ చేసే సమయంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, సహకరించలేదని ఆమె ఆరోపించారు. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరును తప్పుపడుతూ ఆమె ట్విట్ చేశారు. గోవా పర్యటనలో తనకు ఎదురైన ఆసౌర్యాన్ని ట్విట్ వేదికగా తన అసంతృప్తిని , ఆందోళనను త్రీవంగా వ్యక్తం చేశారు.
లక్ష్మి తన ట్వీట్‌లో ఇలా పేర్కొంది, "ఇది @IndiGo6E ద్వారా జరుగుతున్న వేధింపు. ఇన్నిసార్లు అడిగినప్పటికీ, నా కళ్లెదుటే నా బ్యాగ్‌కు సెక్యూరిటీ ట్యాగ్ పెట్టలేదు. ఒకవేళ నా బ్యాగులో ఏదైనా వస్తువు పోతే ఇండిగో బాధ్యత తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఒక విమానయాన సంస్థ ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం?" అని ఆమె ప్రశ్నించింది. తనిఖీ సమయంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది చేసిన జాప్యం కారణంగా తోటి ప్రయాణీకుల్లో ఒకరు తమ బ్యాగును వదిలేయాల్సి వచ్చిందని లక్ష్మి పేర్కొన్నారు.

తన బ్యాగును తనిఖీ చేసేందుకు పక్కకు లాగిన సిబ్బంది, దానిని స్వయంగా తెరవడానికి లక్ష్మికి అనుమతించలేదు. తామే బ్యాగును తెరుస్తామని, లేదంటే గోవాలోనే వదిలేస్తామని సిబ్బంది బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ సంఘటనపై లక్ష్మి వరుస ట్వీట్లు చేస్తూ తన అసహనాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు. ఫ్లైట్ 6E585లో జరిగిన ఈ ఘటన అత్యంత హాస్యాస్పదంగా ఉందని, సిబ్బంది ప్రవర్తన చాలా దురుసుగా ఉందని ఆమె విమర్శించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, జరిగిన పొరపాటుకు బాధ్యత వహించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఆమె గట్టిగా కోరింది.
లక్ష్మి చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్యాగ్ లేకపోవడం వల్ల బ్యాగులు తారుమారు అయ్యే అవకాశం ఉంది, లేదా వాటిలో నుండి వస్తువులు పోయే ప్రమాదం కూడా ఉంది. లక్ష్మి తన బ్యాగ్‌కు ట్యాగ్ వేయమని కోరినప్పుడు సిబ్బంది దానిని పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇతర ప్రయాణికులు కూడా విమానయాన సంస్థలతో తమకున్న అనుభవాలను పంచుకుంటూ లక్ష్మికి మద్దతు తెలిపారు. ఈ సంఘటన విమానయాన పరిశ్రమలో సేవల నాణ్యతను మెరుగుపరచవలసిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది. ప్రయాణికుల భద్రత, వారి వస్తువుల సంరక్షణ విమానయాన సంస్థల ప్రాథమిక బాధ్యత అని పలువురు అభిప్రాయపడ్డారు.
I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025
ఈ సంఘటన తరువాత ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ప్రయాణికుల ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిని పరిష్కరించడానికి ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరం.












Click it and Unblock the Notifications