"కొరియా" టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కళ్యాణ్ హీరోయిన్ !!
హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్.. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నాని "గ్యాంగ్ లీడర్" సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'శ్రీకారం', 'వరుణ్ డాక్టర్', 'ఈటీ', 'డాన్', 'సరిపోదా శనివారం' వంటి తెలుగు, తమిళ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన 'ఓజీ' సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది.
కాగా తమిళ సినీ పరిశ్రమలో మాత్రం వరుస విజయాలతో తన స్థానాన్ని బలపరుచుకుంది. అక్కడ స్టార్ హీరోల సరసన నటిస్తూ, కమర్షియల్ హిట్స్ అందుకుని కెరీర్‌లో మంచి దశను అందుకుంది. ఈ క్రమంలోనే తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు పవన్ కళ్యాణ్ "ఓజీ" సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు.. ప్రియాంక నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. దాంతో 'ఓజీ' తర్వాత వెంటనే సినిమాలను ఒప్పుకోకుండా, కథలకు ప్రాధాన్యత ఇస్తూ ఆచితూచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటోంది.

ఈ క్రమంలో రీసెంట్ గానే ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం "మేడ్ ఇన్ కొరియా" డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇది ఆమె కెరీర్‌లో మొదటి మహిళా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం కావడం విశేషం. కాగా ఇప్పుడు ప్రియాంక మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె కొరియా టూరిజం గౌరవ రాయబారిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ మేరకు కొరియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భారతీయ ప్రజలకు కొరియా సంస్కృతిని మరింత చేరువ చేయగలిగే వ్యక్తిగా తనను గుర్తించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొరియా ప్రతినిధులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఆ పోస్టులో.. కొరియా పర్యాటకానికి గౌరవ రాయబారిగా నియమితులవడం నాకు నిజంగా చాలా ప్రత్యేకమైనది. కొరియా సంస్కృతిని భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయగల వ్యక్తిగా నన్ను గుర్తించిన కొరియా ప్రభుత్వానికి, కొరియా పర్యాటక సంస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు.
ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయత నన్ను ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. ఈ బ్యూటిఫుల్ జర్నీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. నాపై ఉంచిన నమ్మకానికి, ఆత్మీయ స్వాగతానికి కొరియా పర్యాటక సంస్థ అధ్యక్షులకు ధన్యవాదాలు. భవిష్యత్తులో రాబోయే వాటి కోసం ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక 'మంజనథి'మూవీలో నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
Beyond grateful for this incredible honour 🇰🇷✨
— Priyanka Mohan (@priyankaamohan) June 1, 2026
Being appointed as the Honorary Ambassador for Korea Tourism is truly very special to me. I’m sincerely thankful to the Korean government and the Korea Tourism Organization for recognising me as someone who can help bring Korean… pic.twitter.com/Rpf0kUftHS












Click it and Unblock the Notifications