టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్: చరిత్ర సృష్టించిన సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ హీరోయిన్‌కు సాధ్యం కానీ అరుదైన రికార్డును సొంతం చేసుకుని మరోసారి తన సత్తా చాటింది. ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "మా ఇంటి బంగారం" బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరి టాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించింది.

"మా ఇంటి బంగారం" చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన మొట్టమొదటి మహిళా ప్రధాన తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 'మా ఇంటి బంగారం' ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసి తొలి మహిళా ప్రధాన తెలుగు సినిమాగా నిలిచిందని దాని నిర్మాతలు ఆదివారం ప్రకటించారు. నటి సమంతకు చెందిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించిన 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్'.. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా తమ ఇన్ స్టాగ్రామ్ టైమ్‌లైన్‌లో ప్రకటించింది. "మా ఇంటి బంగారానికి స్వర్ణ శతకం. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి మహిళా ప్రధాన తెలుగు చిత్రంగా "మా ఇంటి బంగారం" చరిత్ర సృష్టించింది" అని నిర్మాణ సంస్థ రాసుకొచ్చింది.

Actress Samantha Creates History Maa Inti Bangaram Becomes First Female-led Telugu Movie to Cross 100Cr

జూన్ 19న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సమంత రుతు ప్రభు కథానాయికగా నటించగా.. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.నిజానికి సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, అందులోని యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు తాను చాలా దెబ్బలు తిన్నానని, స్టంట్స్ చేసేటప్పుడు రక్తం కారేలా దెబ్బలు కూడా తగిలాయని సమంత వెల్లడించింది. చెన్నైలో జరిగిన ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు వాస్తవికంగా ఉన్నాయా అని సమంతను అడిగారు. ఈ ప్రశ్నకు సమంత స్పందిస్తూ, "మీరు సినిమాలో చూస్తే, స్లో మోషన్ సన్నివేశాలు, ఫ్లయింగ్ షాట్స్, బిల్డ్ అప్ షాట్స్ లేవు. ఇది చాలా వాస్తవికంగా ఉంటుంది. నేను కూడా దెబ్బలు తిన్నాను. నాకు రక్తం కారింది. అవి చాలా వాస్తవికమైన యాక్షన్ సన్నివేశాలు. యాక్షన్ సన్నివేశాలన్నీ నేనే స్వయంగా చేశాను. అందుకే యాక్షన్ అందరికీ నచ్చింది. అది నేనే చేసినట్లుగా కనిపిస్తుంది" అని సమంత పేర్కొన్నారు. .

రాజ్ నిడిమోరు రూపొందించిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' చిత్రంలో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుష కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. 'మా ఇంటి బంగారం' సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే మహిళా ప్రధాన చిత్రాల కలెక్షన్ల రికార్డులను తుడిచిపెట్టేసింది. అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి', కీర్తి సురేష్ నటించిన 'మహానటి' వంటి చిత్ర రికార్డులను చెరిపేసి 'మా ఇంటి బంగారం' ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+