చిరంజీవి కోడలు చేతిలో వైన్ గ్లాస్..?
ఇటీవల కాలంలో ఫేమస్ కావడానికి సోషల్ మీడియాను ఒక సాధనంగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు తమ పాపులారిటీని మరింత పెంచుకోవడానికి సోషల్ మీడియా ఒక ఆయుధంలా మారిందనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారు చాలామందే ఉన్నారు. తాజాగా ఇదే బాటను ఎంచుకుంది మరో నటి. శ్రియ శర్మ ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అమ్మడు చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాల్లో కనిపించి సందడి చేసింది.
చిరంజీవి నటించిన ''జై చిరంజీవ'' సినిమాలో ఆయన కోడలుగా శ్రియ శర్మ నటించింది. ఆ సినిమాలో శ్రియ శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ''దూకుడు'' సినిమాలో సమంత చెల్లెలుగా నటించింది. శ్రియ శర్మ హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. 'గాయకుడు' 'నిర్మల కాన్వెంట్' సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. ఆ తర్వాత ఈ చిన్నది మూవీలకు బ్రేక్ ఇచ్చి స్టడీస్‌పై దృష్టి పెట్టింది.

శ్రియ శర్మ తిరిగి సినిమాల్లో నటించాలని చూస్తోంది. దీంతో సోషల్ మీడియాకు గట్టిగానే పని చెప్పింది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో సన్నజాజిలా సన్నగా ఉన్న ఈ చిన్నది. ఇప్పుడు ఇలా బొద్దుగా ముద్దుగా మారిపోయింది. ఏదో హోటల్‌లో చేతిలో గ్లాస్‌తో ఉన్న ఫొటోలను ఆప్‌లోడ్ చేసింది. శ్రియ శర్మ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చిరంజీవి కోడలు చేతిలో వైన్ గ్లాస్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. బోల్డ్ కమ్ చబ్బీలా అవుతున్నావ్ అని.. సూపర్ అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం శ్రియ శర్మ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications