'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!!

టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ శ్రీలీల.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో నటించి అభిమానులను అలరించింది. ఆ సినిమా తాజాగా రిలీజైంది. పుష్ప-2 సినిమాలో కిస్సిక్ పాటతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. అయితే ప్రస్తుతం భారీ సక్సెస్‌తో బిజీగా ఉన్న శ్రీలీల.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని వదిలేసి మళ్లీ చదువుకోవడానికి వెళ్లిపోవాలని అనుకుందట.

ట్రోలింగ్ చూసి భయం.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీలీల!
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కో-స్టార్ రాశీ ఖన్నాతో కలిసి పాల్గొన్న శ్రీలీల..సోషల్ మీడియా ట్రోలింగ్‌పై మనసు విప్పింది. కెరీర్ ఆరంభంలో తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూసి తాను ఎంతగా కుంగిపోయిందో శ్రీలీల వివరించింది. శ్రీలీల మాట్లాడుతూ.."నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. నాపై వచ్చే ట్రోల్స్ చూసి చాలా ఏడ్చేదాన్ని. ఒకానొక దశలో భయమేసి మా అమ్మ దగ్గరకు వెళ్లి.. అమ్మా, నాకు యాక్టింగ్ వద్దు.. నేను ఇది చేయలేను. మళ్లీ స్కూల్ లేదా కాలేజీకి వెళ్లి చదువుకుంటాను అని చెప్పాను" అంటూ శ్రీలీల తన పాత రోజులను గుర్తు చేసుకుంది.

Actress Sreeleela Emotional Reveal Says I Cried and Wanted to Quit Acting Due to Social Media Trolling

ఇప్పుడు అలవాటైపోయింది..
అయితే కాలక్రమేణా తాను మానసికంగా దృఢంగా తయారయ్యానని శ్రీలీల వెల్లడించింది. "అప్పట్లో చాలా బాధగా ఉండేది కానీ.. ఇప్పుడు వీటన్నింటికీ అలవాటు పడిపోయాను. ఇప్పటి ప్రేక్షకులు చాలా తెలివైన వారని నేను నమ్ముతాను. వారు ఏదైనా నెగిటివిటీని చూసినప్పుడు దాని వెనుక ఉన్న నిజాన్ని కూడా ఆలోచిస్తున్నారు" అని శ్రీలీల చెప్పుకొచ్చింది.

ఆవేదన వ్యక్తం చేసిన రాశీ ఖన్నా
శ్రీలీల మాటలతో మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఏకీభవించింది. సోషల్ మీడియాలో నెగిటివిటీ రోజురోజుకూ పెరిగిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం వ్యూస్ కోసం జనాలు నిజానిజాలు తెలుసుకోకుండానే విమర్శలు చేస్తున్నారని.. ఇది తనను కూడా భయపెడుతుందని రాశీ ఖన్నా పేర్కొంది.

శ్రీలీల కెరీర్ విషయానికొస్తే..
శ్రీలీల ఇటీవలే తన ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి డాక్టర్‌గా పట్టా అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి తన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు రాశీ ఖన్నా కూడా 'ఫర్టీ 2'తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మొత్తానికి ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా వెండితెర వెనుక నటీనటులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందో శ్రీలీల మాటలు నిరూపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+