వెంకటేష్ సరసన కూతురుగా - హీరోయిన్‌గా చేసిన బ్యూటీ ఎవరంటే..?

తెలుగు చిత్రపరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సీనియర్ నిర్మాతగా రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ వెంకటేష్ హీరోగా రాణిస్తుంటే.. సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. వెంకటేష్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతూ.. రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో భారీ హిట్ కొట్టారు.

అయితే తన కెరీర్ లో ఎంతో మంది నటీమణులతో కలిసి నటించారు. అయితే గతంలో ఆ హీరో పక్కన ఒక పాత్రలో నటించి తర్వాత మరో పాత్రలో నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలానే వెంకీ మామ సరసన కూతురుగా నటించి .. ఆ తర్వాత హీరోయిన్ గా నటించిన బ్యూటీ ఒకరు ఉన్నారు. ఆ వివరాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

actress-sridevi-acted-as-daughter-and-heroin-with-victory-venkatesh

అతిలోక సుందరి శ్రీదేవి.. తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో నటించి స్టార్ బ్యూటీగా ఎదిగారు. శ్రీదేవి చిన్న వయసులోనే నటనను ప్రారంభించారు. అప్పట్లో ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండ్స్‌తో బాలనటిగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. 'బడి పంతులు', 'వేటగాడు', 'జగద్గురు ఆదిశంకర' వంటి చిత్రాలలో ఆమె పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయి. కాగా శ్రీదేవి తన బాల్య దశలోనే తెలుగు తెరపై ఎన్టీఆర్ మనవరాలిగా కనిపించడం విశేషం. కానీ కాలం గడిచే కొద్దీ, అదే ఎన్టీఆర్‌ సరసన కథానాయికగా నటించడం అప్పట్లో పెద్ద సంచలనమైంది.

బాబాయ్ పాత్రలో వెంకీ - కూతురిగా శ్రీదేవి

ఈ క్రమంలోనే 1972లో విడుదలైన తమిళ క్లాసిక్‌ 'వసంత మాళిగై' చిత్రంలో శ్రీదేవి బాలనటిగా కనిపించారు. ఈ చిత్రం తెలుగులో 'ప్రేమనగర్' పేరుతో తెరకెక్కింది. ఇందులో ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర పోషించగా.. ఆయన సోదరుడి పాత్రలో విజయ్ నటించారు. ఆ సినిమాలోని చిన్న పిల్లల పాత్రల్లో వెంకటేష్‌, శ్రీదేవి ఇద్దరూ నటించారు. వెంకటేష్‌ విజయ్‌ తమ్ముడిగా, శ్రీదేవి ఆయన కూతురి పాత్రలో నటించారు. ఆ లెక్కన చూస్తే వెంకటేష్ శ్రీదేవికి బాబాయ్‌గా నటించారు.

19 ఏళ్ల తర్వాత - హీరోహీరోయిన్..

అయితే సరిగ్గా 19 ఏళ్ల తర్వాత అదే జంట మళ్లీ తెరపై కలిసి నటించారు. అప్పుడు బాబాయ్‌-కూతురుగా కనిపించిన వారు ఈసారి హీరో-హీరోయిన్లుగా అదరగొట్టారు. 1991లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'క్షణక్షణం' చిత్రంలో వెంకటేష్‌, శ్రీదేవి జంట ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీదేవి అందం, వెంకటేష్‌ కూల్‌ అటిట్యూడ్‌ తో మూవీ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక చిత్రం కావడం విశేషం.

actress-sridevi-acted-as-daughter-and-heroin-with-victory-venkatesh

శ్రీదేవి తెలుగులో నటించిన చివరి చిత్రం 'ఎస్.పి. పరశురాం' (1994). ఆ తర్వాత బాలీవుడ్‌లో 'జుదాయ్', 'లమ్హే', 'ఇంగ్లీష్ వింగ్లీష్', 'మామ్‌' వంటి చిత్రాలలో మెప్పించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు వెంకటేష్. అలానే చిరంజీవి "మన వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు" అనే మూవీలో సైతం ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+