కోర్టు మెట్లు ఎక్కిన ఐశ్వర్య రాయ్..ఇక తప్పలేదంటూ
ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఐశ్వర్య రాయ్‌ను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది.
ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.జోధా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది.సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది.

ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ తాజాగా కోర్టు మెట్లు ఎక్కారు. తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను అశ్లీలంగా చూపిస్తున్నారంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు.కొద్ది రోజులుగా ఐశ్వర్యకు సంబంధించిన అనేక నకిలీ, అశ్లీల ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఆమె ఈ న్యాయ పోరాటం ప్రారంభించారు. ఐశ్వర్య రాయ్ తరపు న్యాయవాదులు, కొన్ని వెబ్‌సైట్లు మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఆమె ఫోటోలు, వీడియోలు మరియు వాయిస్‌ను అశ్లీల కంటెంట్ సృష్టించడానికి దుర్వినియోగం చేస్తున్నాయని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు, ఆయా ప్లాట్‌ఫారమ్‌లకు తాత్కాలిక నిషేదాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు , టెలికాం సంస్థలు, వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు సంబంధించిన అనధికార కంటెంట్‌ను 72 గంటల్లోగా తొలగించాలి. ఈ ఆదేశాలు ప్రత్యేకంగా AI, డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా సృష్టించబడిన కంటెంట్‌కు వర్తిస్తాయి, అలాంటి కంటెంట్ పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులు వచ్చే ఏడాది జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications