అక్కినేని అఖిల్ కోసం రంగంలోకి దిగిన రాజమౌళి

అక్కినేని అఖిల్.. హీరోగా పరిచయం అవడానికి ముందు పెద్ద స్టార్ అవుతాడని, బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తాడని అంచానలు ఉండేవి. కానీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ చిత్రంతో హీరోగా పరిచయమవగా.. మొదటి సినిమాకే పరాజయం పలకరించింది. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్', 'ఏజెంట్' సినిమాలు చేయగా.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మాత్రమే హిట్ అందుకుంది. చివరి సినిమా ఏజంట్ అయితే భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీనికి సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా, అనిల్ సుంకర నిర్మాత

అఖిల్ సినిమాలపై అభిమానులకు రోజురోజుకు నమ్మకం పోతోంది. ఒక్క బ్లాక్ బస్టర్ అయినా రాకపోతుందా? అని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్. అతని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నారు.

akkineni akhil

స్క్రిప్ట్ దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్న నిర్మాతలు.. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళిని, ఆయన కుమారుడు కార్తికేయని రంగంలోకి దింపారు. రాజమౌళి సూచనలతో స్క్రిప్ట్ అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళిని అందరూ జక్కన్న అని, పని రాక్షసుడు అని పిలుస్తుంటారు. ప్రతి సీన్ మీద, ప్రతి షాట్ మీద ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి.. సినిమాను శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతారు. అందుకే జక్కన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే రాజమౌళి అని చెప్పవచ్చు. అటువంటి దర్శక ధీరుడి సూచనలు, సలహాలతో స్క్రిప్ట్ సిద్ధమవుతుందంటే ఈసారి అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అక్కినేని అభిమానులు సంబరపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+