జపాన్ థియేటర్లలో ‘మనం’ సందడి.. నాగార్జున సర్ప్రైజ్ !
తెలుగు సినిమాలకు ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో సైతం మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ జాబితాలోనే జపాన్‌లో తెలుగు చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'ముత్తు' సినిమాతో జపాన్ లో కూడా భారీ హిట్ అందుకున్నారు.
ఇక ఇటీవల ప్రభాస్ 'బాహుబలి'.. ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీలు సైతం మంచి కలెక్షన్స్ రాబట్టాయి. కొద్దిరోజుల క్రితమే ఎన్టీఆర్ 'దేవర' సినిమా సైతం రిలీజ్ప్ర అవ్వగా.. ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు తెలుగులో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోన 'మనం' కూడా.. జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఆగస్టు 8న జపాన్ థియేటర్లలో ఈ చిత్రం రీ-రిలీజ్ కానుంది.

ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..
2014లో విడుదలై "మనం" సినిమా టాలీవుడ్ చరిత్రలోనే ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని కుటుంబం మూడు తరాల నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఒకే తెరపై కనిపించి ప్రేక్షకులను మైమరిపించారు. అక్కినేని అఖిల్ కూడా అతిథి పాత్రలో మెరిసి సర్ ప్రైజ్ ఇచ్చారు.
అంతే కాకుండా దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావుకు ఇదే చివరి సినిమా కావడంతో అభిమానులకు సైతం ఒక స్పెషల్ మూవీగా మారింది. పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ.. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ జోనర్ లో వచ్చింది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అయితే 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నాగార్జున నటనకు ఫిదా అయిన జపనీయులు. ఈ క్రమంలోనే నాగార్జునను ఆప్యాయంగా "నాగ్ సమా" అని పిలుచుకుంటున్నారు.

అందుకే రీ రిలీజ్ సందర్భంగా.. అక్కినేని నాగార్జున జపాన్ అభిమానులతో వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా ముచ్చటించనున్నారు. దాంతో ఈ సినిమా విడుదల.. భవిష్యత్తులో మరిన్ని తెలుగు చిత్రాలకు జపాన్ లో మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications