"ఏఎన్నార్" పరువును నాగార్జున మంటగలుపుతున్నారా .. హర్ట్ అవుతున్న ఫ్యాన్స్ !
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ రెండు కళ్ల లాంటి వారు అని చెబుతారు. పౌరాణికం, సాంఘికం, జానపదం, కమర్షియల్, మాస్, క్లాస్ ఇలా అన్ని రకాల జానర్స్‌లో విభిన్న పాత్రలు పోషించి సత్తా చాటారు. అందుకే ఈ ఇద్దరు దిగ్గజాలకు తెలుగు సినిమా ప్రపంచంలోనే కాదు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. వారి వారసులుగానే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, ఏఎన్నార్ ఫ్యామిలీ నుంచి నాగార్జున అగ్రహీరోలుగా తలెత్తారు. మాస్, క్లాస్ ఇలా అన్ని రకాల పాత్రల్లో సత్తా చాటుతూ స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ గ్రీకు వీరుడు, మన్మధుడు అంటే గుర్తొచ్చేది నాగార్జుననే. 60లు దాటిన వయసులో కూడా తన గ్లామర్‌ను మెయింటెయిన్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించిన ఆయన, ఈ మధ్య స్పీడ్ తగ్గించారు. ఇటీవల నాగార్జున చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో నాగార్జున తన రూట్ మార్చారు. మొన్నటి వరకు హీరోగానే సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలవైపు మొగ్గు చూపుతున్నారు.

ఇటీవల "కుబేర" చిత్రంలో డిఫరెంట్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న "కూలీ" సినిమాలో నాగార్జున పూర్తి విలన్ అవతారం ఎత్తారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన "విక్రమ్" చిత్రంలో చివరి నిమిషాల్లో సూర్య విలన్‌గా ఎంట్రీ ఇచ్చి సంచలనంగా నిలిచినట్టు, నాగార్జున కూడా ఇప్పుడు అలాంటి పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడు. అయితే "కూలీ" ట్రైలర్‌లో నాగార్జున పాత్రకు ఆ స్థాయిలో ఎలివేషన్స్ ఇవ్వలేదని అక్కినేని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
తెలుగు నాట భారీ అభిమాన దళం ఉన్న నాగార్జున విలన్ పాత్రలో కనిపిస్తుంటే, ట్రైలర్‌లో ఆ స్థాయిలో హైప్ ఎందుకు రాలేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ వారసుడిగా ఉన్న బాలయ్య మాత్రం ఫ్లాప్స్‌కి భయపడకుండా దూసుకుపోతుంటే, నాగార్జున మాత్రం హీరోగా కాకుండా ఇతర పాత్రలు చేస్తూ వెనకడుగు వేస్తున్నారంటూ అభిమానులు బాధపడుతున్నారు. ఎంతోమంది అభిమానుల హృదయాల్లో ఆరాధ్యదైవంగా ఉన్న ఏఎన్నార్ పరువును నాగార్జున ఇలా తక్కువ చేస్తుండటం బాధాకరమంటూ అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం "కూలీ". ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ గా రాబోతుంది ఈ మూవీ. ఈ చిత్రాన్ని ఆగస్టు 14, 2025న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్, పూజా హెగ్డే లాంటి ప్రముఖ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.
ఈ మూవీలో.. నాగార్జునతో పాటు కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్.. తమిళ నటుడు సీనియర్ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications