ఇటలీ వెళ్లిన సమంత, నాగచైతన్య?
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. నవంబరు ఒకటోతేదీన పెళ్లి జరగనుంది. ఇప్పటికే అతిథులకు కాక్‌టైల్ పార్టీ ఇచ్చారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలే ధూమ్‌ధామ్‌గా జరిగాయి. వరుణ్-లావణ్య తొలిసారిగా ప్రేమలో పడింది ఇటలీలోనే కావడంతో పెళ్లి అక్కడే జరపాలని నిశ్చయించుకున్నారు.
ఈ వివాహానికి మాజీ భార్యాభర్తలైన అక్కినేని నాగచైతన్య, సమంత.. ఇద్దరూ హాజరవుతున్నారు. వీరితో పాటు రష్మిక మందన్న కూడా హాజరవుతోంది. ఏదేమైనా చైతు - సమంత ఈ పెళ్లికి వెళ్లడమే పెద్ద హైలెట్‌గా నిలుస్తోంది. విడాకుల తర్వాత వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధాలే చేస్తున్నారు. తప్పు నాగచైతన్యదని సమంత అభిమానులు అంటే.. అసలు తప్పంతా సమంతదేనని నాగచైతన్యకు మద్దతిచ్చేవారు వాదిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట ఎప్పుడూ ఒకర్నొకరు ఎదురుపడిన సందర్భాలు కూడా లేవు.

అలాంటిది వరుణ్ తేజ్ పెళ్లికి వీరిద్దరూ హాజరు కాబోతుండటంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరు ఎదురుపడితే హావభావాలు ఎలా ఉంటాయి? ఇద్దరూ మాట్లాడుకుంటారా? పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారా? అంటూ ఇలా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మాటవరుసకు కూడా విష్ చేసుకునే ఉద్దేశంలో వీరిద్దరూ లేరని, అసలు ఇద్దరూ ఒకర్నొకరు ఎదురుపడినప్పుడు సంగతి కదా అని మరికొందరు అంటున్నారు. వీరితో పాటు రష్మిక కూడా ఇప్పటికే ఇటలీ బయలు దేరి వెళ్లారు. కానీ ఈ వివాహానికి సెంటర్ ఆఫ్ అట్రక్షన్ గా నాగచైతన్య-సమంత నిలవబోతున్నారని కచ్చితంగా చెప్పవచ్చు. విడాకుల తర్వాత తొలిసారిగా వీరిద్దరు ఎదురుపడినప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూడాలని ఉందంటున్నారు నెటిజన్లు.












Click it and Unblock the Notifications