70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..

అటవీ సంరక్షణ చరిత్రలోనే అత్యంత అరుదైన, అద్భుతమైన ఘట్టం నమోదైంది. ఏకంగా ఏడు దశాబ్దాల తర్వాత కజకిస్థాన్ భూభాగంలో ఒక క్రూర మృగం స్వేచ్ఛగా అడుగుపెట్టింది. గత శతాబ్దం మధ్యలో కనుమరుగైపోయిన పులుల సంతతిని మళ్లీ ఆ నేల పైకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు చేపట్టిన భారీ ప్రాజెక్టు ఫలించింది. 'ఉమిత్' అని పిలిచే ఒక పెద్దాడి ఆడ అముర్ పులిని ఇలే-బాల్ఖాష్ వన్యప్రాణి అభయారణ్యంలోకి విజయవంతంగా విడుదల చేశారు. దీంతో కజకిస్థాన్ అడవుల్లో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా పులి అడుగుల శబ్దం వినిపిస్తోంది.

క్యాస్పియన్ పులి స్థానంలో అముర్ పులి

1950ల కాలంలో కజకిస్థాన్‌తో పాటు మధ్య ఆసియా ప్రాంతాల్లో 'క్యాస్పియన్ పులులు' రాజ్యమేలేవి. అయితే విచక్షణారహిత వేట, నివాస ప్రాంతాలు దెబ్బతినడంతో ఆ జాతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జీవశాస్త్ర పరంగా క్యాస్పియన్ పులికి అత్యంత సమీప పోలికలు ఉండే 'అముర్ పులి'ని పరిశోధకులు ఎంచుకున్నారు. ప్రస్తుత పులి జాతుల్లోనే పరిమాణంలో అత్యంత పెద్దదిగా పేరుగాంచిన ఈ అముర్ పులి రాకతో, స్థానిక అటవీ పర్యావరణ వ్యవస్థ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భావిస్తున్నారు.

Kazakhstan Releases Amur Tiger Umit Into Wild After 70 Years Marking Historic Rewilding Breakthrough

ఇంతకాలం ఎందుకు ఆలస్యమైంది?

ఒక అగ్రశ్రేణి క్రూర మృగాన్ని తీసుకెళ్లి అడవిలో బోను తెరిచి వదిలేయడం అంత తేలికైన విషయం కాదు. దానికి సరిపడా వాతావరణాన్ని, ఆహారాన్ని సిద్ధం చేయడానికే ఏళ్ల సమయం పట్టింది. ముందుగా వేటగాళ్ల బెడద లేకుండా కఠినమైన చట్టాలు తెచ్చారు. పులికి ఆహారంగా ఉపయోగపడే దుప్పులు, అడవి పందుల జనాభాను పెంచేందుకు అటవీ శాఖ కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమించింది. అభయారణ్యంలో పర్యావరణం పులి మనుగడకు పూర్తిగా అనుకూలించిందని స్పష్టమైన ఆధారాలు దొరికాకే శాస్త్రవేత్తలు ఈ విడుదల ప్రక్రియకు ఆమోదం తెలిపారు.

అంతరించిపోతున్న అరుదైన చిరుత. భారీ సెక్యూరిటీతో మాస్టర్ ప్లాన్
అంతరించిపోతున్న అరుదైన చిరుత. భారీ సెక్యూరిటీతో మాస్టర్ ప్లాన్

సాంకేతికతతో నిరంతర నిఘా

అడవిలో వదిలినంత మాత్రాన పని పూర్తయిపోలేదు. ప్రస్తుతం 'ఉమిత్' కదలికలను శాస్త్రవేత్తలు జీపీఎస్ కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా నిమిష నిమిషం పర్యవేక్షిస్తున్నారు. అది ఏ ప్రాంతాల్లో తిరుగుతోంది, ఎలా వేటాడుతోంది, కొత్త వాతావరణానికి ఎంతవరకు అలవాటు పడుతోందనే విషయాలను క్షేత్రస్థాయి బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇతర పులులను కూడా ఇక్కడకు ప్రవేశపెట్టి, ఒక కొత్త పులుల జనాభాను సృష్టించాలనేది వారి ముఖ్య లక్ష్యం.

తడోబా పులి.. కళ్లు చెదిరే రాజసం. చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే!
తడోబా పులి.. కళ్లు చెదిరే రాజసం. చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే!

ప్రపంచ రికార్డు దిశగా అడుగులు

ఒక ప్రాంతంలో పూర్తిగా అంతరించిపోయిన పులుల జాతిని, దశాబ్దాల తర్వాత మళ్లీ అదే ప్రాంతంలో పునరుద్ధరించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కానుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పులులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రయోగం గనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న ఇతర పెద్ద క్రూర మృగాలను కూడా వాటి పూర్వీకుల అడవుల్లోకి మళ్లీ ప్రవేశపెట్టడానికి ఇది ఒక తిరుగులేని నమూనాగా మారుతుందని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+