ఆ రెండు సినిమాలు చేసుంటే బ్లాక్ బస్టర్ హీరో అయ్యేవాడు?

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోగా కొనసాగుతున్న నాగచైతన్య స్టార్ హీరోగా రూపుదాల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే కాలం కలిసిరావడంలేదు. ఇటీవలే కస్టడీ సినిమా విడుదలైందికానీ ఫ్లాపైంది. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో నిర్మితమైన జోష్ చిత్రంద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య దగ్గరకు రెండు సినిమాల ఆఫర్లు వచ్చాయి.

వరుణ్ సందేశ్, శ్వేతబసు ప్రసాద్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారులోకం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథ ముందుగా నాగచైతన్య దగ్గరకే రాగా నాగార్జున దీన్ని తిరస్కరించాడు. ఈ సినిమా చేసుంటే నాగచైతన్య ఒక రేంజ్ లో ఉండేవాడని పరిశ్రమలో వార్తలు వస్తుంటాయి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు తీసిన మరో చిత్రం సుప్రీమ్. అనుకోని కారణాలవల్ల ఈ కథ సాయిధరమ్ తేజ్ దగ్గరకు చేరింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ కు మంచి ఇమేజ్ ఏర్పడింది.

akkineni nagachaitanya missed two block buster movies

ఈ రెండు సినిమాలే కాకుండా జడ్జిమెంట్ సరిగా లేకుండా మరికొన్ని కథలను కూడా నాగచైతన్య తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను చేసుంటే స్టార్ హీరోల రేంజ్ లో ఉండేవాడని, కానీ సమంతతో విడాకుల తర్వాత కాస్తంత ప్రశాంతతను కోల్పోయాడని అభిమానులు అంటున్నారు. సమంత, నాగచైతన్య.. ఇద్దరూ కలిసిపోవాలని, అలా చేస్తే నాగచైతన్య బ్లాక్ బస్టర్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేవాడంటున్నారు. తండేల్ సినిమా నాగచైతన్యకు కావాల్సిన బ్లాక్ బస్టర్ హోదాను ఇస్తుందేమో చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+