పసిడి ధరల్లో భారీ పతనం- మారని పరిస్థితులు: వీకెండ్ లో

దేశంలో బంగారం, వెండి ధరలు ఈ వారంలో భారీగా తగ్గుదల నమోదు చేశాయి. స్పాట్ గోల్డ్ 1.5 శాతం పతనాన్ని చవిచూసింది. స్పాట్ వెండి ధర కూడా క్షీణించింది. సుమారు నాలుగు శాతం మేర పడిపోయింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్ లో హెచ్చుతగ్గులకు దారి తీశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ పాలసీలో రేట్ల పెంపునకు ఇప్పుడు 60 శాతం అవకాశాలు ఉండటం కూడా వీటి రేట్లను ప్రభావితం చేసింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఈ వీకెండ్ లో బంగారం ధర రూ. 1,43,500 దిగువన ముగిసింది. కిలో వెండి రూ. 2.23 లక్షల క్షీణతను రికార్డు చేసింది. రాబోయే కాలంలో కమోడిటీ ట్రెండ్ మరింత అస్థిరంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. వచ్చే వారం ఎంసీఎక్స్ వద్ద బంగారం రూ. 1.42 లక్షల నుండి రూ. 1.45 లక్షల మధ్య కదలాడే అవకాశాలు లేకపోలేదు. పెట్టుబడిదారులు అమెరికన్ సీపీఐ డేటాపై దృష్టి సారించారు. ఇది వడ్డీ రేట్ల గమనంపై మరింత స్పష్టతను ఇస్తుంది.

Gold Prices Falls in India at MCX as 24K 22K and 18K Negative Global Sentiment Fuels Price Down

ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,44,960 ఉండగా, 22 క్యారెట్లు రూ. 1,32,910కి లభిస్తోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,44,830, 22 క్యారెట్లు రూ. 1,32,760 పలుకుతోంది. ఆయా నగరాలతో పోల్చుకుంటే చెన్నైలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,45,650గా, 22 క్యారెట్లు రూ. 1,33,510గా రికార్డయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,509, 22 క్యారెట్లు - రూ. 13,300, 18 క్యారెట్లు - రూ. 11,120

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+