'నా సామిరంగ': రెండోరోజు తుక్కు రేగ్గొట్టిన నాగార్జున
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన నా సామిరంగ చిత్రం సూపర్ హిట్ దిశగా ముందుకు దూసుకుపోతోంది. ఆషికా రంగనాథ్ కథానాయిక కాగా, నాజర్, మిర్నా మీనన్, రావు రమేష్ తదితరులు నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన మొదటి చితం ఇది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఎంఎం కీరవాణి స్వరాలందించారు.
విడుదలైన మొదటిరోజు మొదటి షో నుంచే సినిమా బాగుంది.. సూపర్ హిట్ అనే టాక్ ను మూటగట్టుకున్న నా సామిరంగ భారీ కలెక్షన్ల దిశగా పరుగులు తీస్తోంది. నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 8.30 కోట్ల బిజినెస్ జరిగింది. టోటల్ గా తెలుగులో రూ. 18.22 కోట్లకు అమ్ముడుకాగా, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.01 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2.01 కోట్లకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 19.01 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.19.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.23 కోట్లు బిజినెస్ అయిన విషయం తెలిసిందే..

ఈ సినిమా రెండో రోజు మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. నైజాం రూ.1.47కోట్లు, సీడెట్ రూ. 76లక్షలు, వైజాగ్ రూ. 56 లక్షలు, తూర్పుగోదావరి రూ. 54 లక్షలు, పశ్చిమ గోదావరి రూ.34 లక్షలు, కృష్ణ రూ. 26లక్షలు, గుంటూరు రూ.41లక్షలు, నెల్లూరు రూ.20లక్షలు వసూలు చేసింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 17.8 కోట్లు రాబట్టింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నా సామిరంగ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న నాగార్జున తన తదుపరి చిత్రానికి కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. స్ట్రెయిట్ కథతో చేయాలా? లేదంటే విజయవంతమైన చిత్రాలకు రీమేక్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ తనకు అచ్చొచ్చిన సంక్రాంతికి కచ్చితంగా సినిమా విడుదల చేసేలా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు నాగ్ సన్నిహితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications