ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన నాగార్జున.. 100 వ సినిమా వేళ..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు సూర్య. అంతకుముందు కంగువ, రెట్రో సినిమాలు ప్లాఫ్ అయిన నేపథ్యంలో స్టోరీ సెలక్షన్ పై దృష్టి పెట్టిన సూర్య ఇప్పుడు వరస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం మరో మూడు సినిమాలు చేస్తున్నారు సూర్య. సూర్య 47 టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీకి జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో సూర్య సరసన నజ్రియా, నస్లేన్ తదితరులు నటిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇక సూర్య 48 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ బయోగ్రాఫికల్ సినిమాలో సూర్య సరసన కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సూర్య 49 సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందనున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కుబేర, కూలీ సినిమాల్లో నాగార్జున నెగటివ్ రోల్ లో నటించారు. అయితే నాగార్జున ఇలా వరుసగా విలన్ పాత్రలు చేయడం ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చడం లేదట. అరవైలోనూ నవ మన్మథుడిలా ఉన్న నాగార్జున విలన్ పాత్రలు చేయడంపై అక్కినేని ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ అఫీషియల్ ప్రకటన రాలేదు.

AkkineniNagarjuna to play the villain in Kollywood star hero Suriya s 49th film AkkineniNagarjuna

ఇక కింగ్ నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ సినిమాకు కింగ్ 100 అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఆర్ ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టబు, సుష్మిత భట్, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+