జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ను దెబ్బతీసిన అల్లు అర్జున్?
తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ స్టార్ కథానాయకులుగా కొనసాగుతున్నారు. వీరి సినిమాలకు వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్ లోనే ఉంటాయి. వీరి సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ పాన్ ఇండియా స్థాయికి, గ్లోబల్ హీరో స్థాయికి చేరుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమా తెలుగులోకన్నా నార్త్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ ఒక్క సినిమా బన్నీ రేంజ్ ను అమాంతం పెంచేసింది.
ఇండస్ట్రీ హిట్ కొట్టాడు
పుష్ప2 కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా వీరిద్దరూ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. బావా.. అంటే బావా.. అని పిలుచుకుంటుంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ అరవింద సమేత వీరరాఘవ సినిమా చేశారు. ఆ సినిమా చేసిన తర్వాత మూడు సంవత్సరాల వరకు తారక్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్ నుంచి అల వైకుంఠపురంతోపాటు పుష్ప సినిమాలు రెండు వచ్చాయి. అల వైకుంఠపురం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. పుష్ప బ్లాక్ బస్టర్ అయింది.

సరైన ప్రణాళిక లేక..
ఒక్కసారిగా అల్లు అర్జున్ క్రేజ్ ఒక రేంజ్ కు వెళ్లిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత అది కూడా రూ.1200 కోట్లకుపైనే వసూలు చేసిందికానీ ఆ సినిమాలో తారక్ సహాయ నటుడి పాత్ర మాత్రమే పోషించాడు అంటూ విమర్శలు వచ్చాయి. ఈ సినిమా విడుదలైన మూడు సంవత్సరాల వరకు మళ్లీ ఒక్క సినిమా కూడా తారక్ నుంచి విడుదల కాలేదు. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర విజయదశమికి వాయిదా పడింది. ఇలా ఆలస్యం జరగడంవల్ల చివరకు తారక్ మార్కెట్ పరంగా నష్టపోగా, ఆ మార్కెట్ ను అల్లు అర్జున్ కైవసం చేసుకున్నాడు. అల వైకుంఠపురం సినిమాకు ముందువరకు తారక్ కు ఉన్న క్రేజ్ కానీ, ఇమేజ్ కానీ అల్లు అర్జున్ కు లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సకాలంలో చేయక.. సరైన షెడ్యూల్ ను రూపొందించుకోలేక, ఒక ప్రణాళిక ప్రకారం సినిమాలు చేయక తన మార్కెట్ ను అల్లు అర్జున్ కు కోల్పోయాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేవర ఇండస్ట్రీ హిట్ కొడితే తారక్ రేంజ్ ఎక్కడికో వెళుతుంది. చూద్దాం ఆ సినిమా ఎలా ఆడుతుందో.












Click it and Unblock the Notifications