చరణ్‌ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. 'పెద్ది'పై అల్లు అర్జున్ ట్వీట్ !!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం "పెద్ది". 'ఉప్పెన' మూవీ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్ సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త సమర్పణలో.. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మించారు. ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించి అద్బుత విజయాన్ని అందుకుంటున్నారు.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. కాగా ఈ చిత్రంపై సాధారణ ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు.

ఏం పోస్ట్ చేశారంటే..
అల్లు అర్జున్ ఆ పోస్టులో.. "నా ప్రియమైన రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. రఫ్‌గా, సహజంగా కనిపించే పాత్రలో ఆయన చూపించిన నటన అసాధారణం. పాత్ర కోసం చేసిన శారీరక మార్పు, తెరపై చూపించిన ఎనర్జీ, అలాగే డ్యాన్స్‌లో కనబరిచిన గ్రేస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ ఆయన తన అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు. చరణ్ ని చూస్తుంటే నిజంగా ఎంతో గర్వంగా ఉంది. ఆయనకు లభిస్తోన్న ప్రశంసలకు రామ్‌చరణ్ పూర్తిగా అర్హుడు అంటూ ట్వీట్ చేశారు.
అలానే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ గురించి ప్రస్తావిస్తూ.. జగ్గుభాయ్ (జగపతిబాబు)తో పాటు అందరూ అద్భుతంగా నటించారని, కథానాయిక జాన్వీ కపూర్‌కు తన ప్రేమాభిమానాలు తెలియజేస్తున్నానని బన్నీ పేర్కొన్నారు. ఈ మూవీ దర్శకుడు బుచ్చిబాబును ప్రత్యేకంగా అభినందిస్తూ.. ప్రతి పాత్రను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, రామ్ చరణ్‌ను మరింత గొప్ప స్థాయిలో ఆవిష్కరించారంటూ కొనియాడారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం 5 రోజుల్లోనే రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
— Allu Arjun (@alluarjun) June 9, 2026
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…












Click it and Unblock the Notifications