మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కౌంటర్..మన అనుకుంటే వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా
మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది. పైకి అంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి.
అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ సైతం పరోక్షంగా అల్లు అర్జున్ గురించి కామెంట్స్ చేయడం చర్చనీయంశంగా మారింది. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరయారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారి బన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.












Click it and Unblock the Notifications