జాతీయ అవార్డు గురించి.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!
ఫుష్ప సినిమాతో అల్లుఅర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డును కైవసం చేసుకున్నాడు. పుష్ప సినిమా అల్లుఅర్జున్‌కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు అల్లుఅర్జున్. ఇటీవల ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి చేతుల మీదుగా అల్లు అర్జున్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ శనివారం రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో పుష్ప టీమ్‌తో పాటు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద అల్లుఅర్జున్ మాట్లాడుతూ జాతీయ అవార్డు గురించి కొన్ని అసక్తికరమైన కామెంట్స్ చేశారు.
టీసీలు తీసుకునే నువ్వు మెడల్ తీసుకోవడం ఎంట్రా..
ఈ సినిమాకు గాను దేవిశ్రీ ప్రసాద్‌కూడా జాతీయ అవార్డు దక్కింది. వేదిక మీద దేవిశ్రీతో పాటు అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ ఇలా మాట్లాడారు..''నేను చెన్నై వెళ్లిన ప్రతిసారి దేవీని కలిసేవాడిని. దేవీశ్రీ నువ్వు బాలీవుడ్‌కి వెళ్లి, అక్కడ చిత్రాలు చెయ్ అని చెబుతూ ఉండేవాడిని. ముందు నువ్వు వెళ్ళు. నీతో పాటు నేను కూడా వస్తాను అనేవాడు దేవీ. నేను వెళ్లడం అంత ఈజీ కాదు. వెళతానో లేదో కూడా నాకు తెలియదు ముందు నువ్వు వెళ్ళు అనేవాడిని.

దేవి కోరుకున్నట్లే ఇరవై ఏళ్ల తర్వాత పుష్ప మూవీతో ఇద్దరం బాలీవుడ్‌లో అడుగుపెట్టాము.. అని సభాముఖంగా తెలిపారు. నేను నేషనల్ అవార్డు గెలిచానని తెలిసి మా ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి... ఎప్పుడూ ప్రిన్సిపాల్ దగ్గర టీసీలు తీసుకునే నువ్వు ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకోవడం ఏంట్రా అని అన్నాడు. నాకు అది గొప్ప కాంప్లిమెంట్లా అనిపించింది. నేను అవార్డు గెలిస్తే నాన్న ఎంత సంతోషపడ్డారో అంతకంటే ఎక్కువ సంతోషం దేవిశ్రీకి అవార్డు రావడంతో ఆయనకు కలిగింది అంటూ చెప్పుకోచ్చారు.
నాకు ఈ అవార్డు రావడానికి కారణం నా చుట్టూ ఉన్నవాళ్లే. వాళ్ళు కోరుకున్నారు కాబట్టే నేను ఈ అవార్డు గెలవగలిగాను. మనం అనుకోవడం కష్టపడటం 50 శాతం మాత్రమే ఉంటుంది. మన పక్కన ఉన్నవాళ్లు గట్టిగా కోరుకున్నప్పుడే మనల్ని విజయాలు వరిస్తాయి అని అన్నారు అల్లుఅర్జున్. నీలోని బెస్ట్ యాక్టింగ్ బయటకు రావాలి అని సుకుమార్ నాతో అన్నారు. నేను ఈ విజయం సాధించానంటే ఆ క్రెడిట్ అంతా సుకుమార్ దే అని చెప్పుకోచ్చారు అల్లుఅర్జున్.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications