జానీ మాస్టర్‌కు బిగ్ షాక్...బాధితురాలికి అండగా అల్లు అర్జున్
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన దగ్గర పని చేసే అస్టిస్టెంట్‌పై జానీ మాస్టర్ అత్యాచారానికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. గత కొంతకాలంగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అస్టిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు పోలీసులు విచారణ చేస్తున్నారు. 376,506,323 సెక్షన్ల కింద జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
#AlluArjun assured the victim in the #JaniMaster case that he would provide work for all his upcoming films and films under the Geetha Arts banner. A great gesture! 🙌❤️ pic.twitter.com/TRIHEEulot
— Movies4u Official (@Movies4u_Officl) September 17, 2024
జానీ మాస్టర్‌పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు సినీ ఇండస్ట్రీ సైతం జానీ మాస్టర్ ఇష్యూపై సీరియస్‌గానే రియాక్ట్ అయింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంది.అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ విడుదల చేసింది. అయితే ఈ సందర్భంగా నటి ఝాన్సీ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ వివాదంలో బాధితురాలికి టాలీవుడ్ పెద్ద హీరో అండగా నిలిచారని చెప్పడం జరిగింది.

తాను చేయబోయే కొత్త సినిమాలో ఆమెకు కొరియోగ్రాఫర్‌గా కల్పిస్తానని ఆ హీరో హామీ ఇచ్చారని ఝాన్సీ చెప్పుకొచ్చారు. దీంతో ఆ టాలీవుడ్ పెద్ద హీరో ఎవరా అన్న చర్చ మొదలైంది. మెజార్టీ నెటిజన్లు మాత్రం ఆ హీరో అల్లు అర్జున్ అని అభిప్రాయపడుతున్నారు. "గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తన రాబోయే అన్ని సినిమాలకు పని అందిస్తానని జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి అల్లు అర్జున్ హామీ ఇచ్చారు" అంటూ ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications