ప్రెస్‌మీట్‌లో బాంబు పేలుస్తున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి చాలాకాలమైంది. దీంతో దీనిపై పరిశ్రమతోపాటు రాజకీయవర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తోపాటు పుష్ప2 దర్శకుడు సుకుమార్, నిర్మాతలు పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు. అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్ లో కూడా ప్రెస్ మీట్ కు సంబంధించిన విషయం ఉంచారు. పుష్ప2 సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబరు ఆరోతేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందు ఐదోతేదీనే విడుదల చేయనున్నారని, దీనికి సంబంధించిన ప్రకటన అని చెబుతున్నారు.
గొడవల్ని తగ్గించడానికి ప్రయత్నాలు
నంద్యాల సంఘటన తర్వాత కొన్ని ప్రీ రిలీజ్ వేడుకల్లో బన్నీ పాల్గొన్నాడుకానీ నేరుగా ప్రెస్ మీట్ నిర్వహించలేదు. ఈ ప్రెస్ మీట్ లో విలేకరులు కచ్చితంగా పవన్ కల్యాణ్ తో నెలకొన్న విభేదాల గురించి, మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాల గురించి ప్రశ్నలు అడుగుతారు. వీటిపై పవన్ కల్యాణ్ సమాధానం ఎలా ఉంటుందా? అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. విభేదాలను తగ్గించడానికే అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారని, అదే విషయాన్ని చెబుతారంటున్నారు. గొడవల్ని కూడా తగ్గించే విధంగా బన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఈ సినిమాకు సంబంధించి నిర్వహించే ప్రీరిలీజ్ వేడుకకు పవన్ కల్యాణ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించే యోచనలో చిత్రయూనిట్ ఉంది.

విభేదాలు సద్దుమణుగుతాయని భావిస్తున్నారు
దీనివల్ల సహజంగానే విభేదాలు సద్దుమణుగుతాయని భావిస్తున్నారు. సినిమాను డిసెంబరు ఐదోతేదీన విడుదల చేయబోతున్న విషయాన్ని చెప్పేందుకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబంధించి రీరికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక గీతం ఒక్కటే షూట్ చేయాల్సి ఉంది. ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తేలలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ తో సహా సిద్ధంగా ఉంది. ప్రత్యేక గీతం చిత్రీకరించిన తర్వాత నవంబరులో మొదటి కాపీ సిద్ధమవుతుందంటున్నారు.












Click it and Unblock the Notifications