EPFO: చేతులెత్తేసిన వెబ్ సైట్. మీ పాస్ బుక్ ఓపెన్ అవుతుందా?

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తీపి కబురు అందించినప్పటికీ, సాంకేతిక లోపాలు ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో 8.25 శాతం చొప్పున వడ్డీ డబ్బులను విజయవంతంగా జమ చేసినట్లు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది.

తమ వడ్డీ సొమ్మును EPFO అధికారిక వెబ్‌సైట్ పోర్టల్ లేదా కేంద్ర ప్రభుత్వ 'ఉమంగ్' (UMANG) మొబైల్ యాప్ ద్వారా సరిచూసుకోవాలని సూచించింది. అయితే, ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి పీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో డిజిటల్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఒకేసారి లక్షలాది మంది యూజర్లు లాగిన్ అవ్వడంతో ఈపీఎఫ్‌ఓ సర్వర్లు పూర్తిగా స్తంభించిపోయాయి.

వెబ్‌సైట్‌లో అరకొర సమాచారం.. యాప్ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు!

ప్రస్తుతం పీఎఫ్ పాస్‌బుక్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఉద్యోగులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులకు 'ఉమంగ్' యాప్ లో అసలు పాస్ బుక్ ఓపెన్ కావడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డిపార్ట్‌మెంట్ చేపట్టిన సిస్టమ్ మైగ్రేషన్, సాంకేతిక మార్పుల కారణంగా యాప్‌లో పీఎఫ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేవంటూ స్క్రీన్‌పై మెసేజ్ దర్శనమిస్తోంది.

EPFO Portals Suffer Technical Glitch and UMANG App Fails as Millions Try Checking PF Interest Credit

ఇక మరోవైపు, EPFO మెంబర్ పోర్టల్ ఓపెన్ చేసినప్పటికీ అక్కడ కూడా పూర్తి వివరాలు కనిపించడం లేదని చందాదారులు వాపోతున్నారు. పోర్టల్‌లో కేవలం సదరు ఉద్యోగికి సంబంధించిన చివరి 5 నెలల కాంట్రిబ్యూషన్స్ (డిపాజిట్లు) మాత్రమే డిస్‌ప్లే అవుతున్నాయని, వడ్డీ డబ్బులు అసలు జమ అయినట్లు చూపించడం లేదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

EPFO: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. పీఎఫ్ లిమిట్ పై కేంద్రం కీలక నిర్ణయం!
EPFO: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. పీఎఫ్ లిమిట్ పై కేంద్రం కీలక నిర్ణయం!

క్లెయిమ్‌లు, పాస్‌బుక్ డౌన్‌లోడ్‌లకు బ్రేక్..

వడ్డీ క్రెడిట్ ప్రక్రియతో పాటు ఈపీఎఫ్‌ఓ 3.0 సిస్టమ్ అప్‌గ్రేడేషన్ బ్యాకెండ్‌లో నడుస్తుండటం వల్ల ఈ సమస్య మరింత జటిలంగా మారింది. సర్వర్ లోడ్ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ-పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం, పాత బ్యాలెన్స్ చెక్ చేయడం, అత్యవసర పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్‌లు పెట్టుకోవడం వంటి పనులన్నీ నిలిచిపోయాయి. సిస్టమ్ పూర్తిగా కుదురుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

EPFO: పాస్ బుక్ ఎప్పుడొస్తుంది? మెంబర్ పోర్టల్‌లో సూపర్ మార్పులు..
EPFO: పాస్ బుక్ ఎప్పుడొస్తుంది? మెంబర్ పోర్టల్‌లో సూపర్ మార్పులు..

ఒకవేళ ఆన్‌లైన్ పోర్టల్, యాప్ ఓపెన్ కాకపోతే చందాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ (SMS) పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఫలితం శూన్యం. మిస్డ్ కాల్ ఇచ్చినా, మెసేజ్ పెట్టినా రిప్లై మాత్రం రావడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+