ఏడేళ్ల వయస్సులో కన్న తండ్రే లైంగికంగా వేధించాడన్న స్టార్ బ్యూటీ..!

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ఖుష్బూ సుందర్‌. ఆమె అందం, అభినయం.. నటనతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా తమిళనాడులో ఆమెకు సపరేట్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఆమె కోసం అభిమానులు ఏకంగా ఆలయాన్ని నిర్మించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అక్కినేని కల్ట్ ఫ్యాన్‌ను కలిసిన
అక్కినేని కల్ట్ ఫ్యాన్‌ను కలిసిన

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్..

ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. 1970 సెప్టెంబర్ 29న ముంబైలో జన్మించిన ఆమె చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. బాలనటిగా బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఖుష్బూ.. 1980లో విడుదలైన ది బర్నింగ్ ట్రైన్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. అనంతరం పలు హిందీ చిత్రాల్లో బాలనటిగా కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

actress-khushboo-sundar-emotional-comments-about-physically-abused-by-her-father-when-she-was-seven

తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్, కమల్ హాసన్, శరత్‌కుమార్, సత్యరాజ్, ప్రభు, కార్తీక్, విజయకాంత్ వంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించి భారీ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా 1990లలో తమిళ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఖుష్బూ ఒకరిగా నిలిచారు. అలానే తెలుగులో కూడా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, వంటి అగ్రహీరోలతో కలిసి ఆమె అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కుటుంబ కథా చిత్రాల్లోనూ, కమర్షియల్ సినిమాల్లోనూ సమానంగా మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక నటనతో పాటు టెలివిజన్ రంగంలో కూడా ఖుష్బూ విజయవంతమైన ప్రస్థానం సాగించారు. పలు ప్రముఖ టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించడమే కాకుండా, రియాలిటీ షోలలో జడ్జిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిర్మాతగా కూడా పలు టెలివిజన్ సీరియల్స్ నిర్మించి విజయాన్ని అందుకున్నారు. కాగా ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి.ను ఖుష్బూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రీసెంట్ గానే వారి పెద్ద కూతురు వివాహం ఘనంగా నిర్వహించారు.

అటు సినిమాలతో పాటు ఖుష్బూ రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. తనకు కేవలం 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. 'ఇది చాలా కష్టమైన విషయం, ఇది నన్ను చాలా కాలంగా వేధిస్తోంది. నేను కోరుకున్నా కూడా దానిని మర్చిపోలేను'అని అన్నారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో చర్చకు తెరలేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+