హార్ముజ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్- షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశం..!
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి యుద్దం మొదలైంది. ఇరుదేశాలూ పరస్పరం దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. దీంతో ముఖ్యంగా హార్ముజ్ జలసంధి (strait of hormuz) తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఈ జలసంధిని దాటే నౌకలు భయం గుప్పిట్లోకి చేరుకుంటున్నాయి. తాజాగా పలు దేశాల నౌకల్లో సిబ్బందిగా ఉంటున్న భారతీయ నావికులు సైతం దాడుల్లో బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ( India) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మన దేశంలోని షిప్పింగ్ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
పర్షియన్ గల్ఫ్ లో పరిస్ధితులు నానాటికీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భారతీయ నావికులను నియమించడాన్ని నిలిపివేయాలని కేంద్రం షిప్పింగ్ కంపెనీలను ఆదేశించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (DGMA) ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. భారతీయ, విదేశీ నౌకా యజమానులు, నౌకా నిర్వాహకులు, రిక్రూట్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సర్వీస్ లైసెన్స్ కంపెనీలకు వర్తిస్తుందని తెలిపింది. హార్ముజ్ జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో సంచరించే వాణిజ్య నౌకలపై వరుస దాడుల తర్వాత ఈ ఆదేశాలు వెలువడ్జాయి.

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ నౌకా మార్గాలలో భద్రతా పరిస్థితి మరింత దిగజారుతున్నందున, భారతీయ నావికులను రక్షించడమే ఈ చర్య యొక్క లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. అధికారిక గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య నౌకా పరిశ్రమలో 3 లక్షలకు పైగా భారతీయులు ఉపాధి పొందుతుండగా, భారతదేశం నావికులను అందించే దేశాలలో మూడవ స్థానంలో ఉంది. ఇటీవలి దాడులలో భారతీయ సిబ్బంది మరణించడం లేదా గాయపడటం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొంబాసాబి, అల్ బహ్యా అనే చమురు ట్యాంకర్లపై జరిగిన క్షిపణి దాడుల్లో ఒక భారతీయ నావికుడు మరణించగా, పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications