మద్యం ప్రియులకు షాక్.. త్వరలో ధరల బాదుడుకు రంగం సిద్ధం!

తెలంగాణాలో మద్యం ప్రియులకు చేదువార్త. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని తాజాగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణా సర్కార్ మద్యం ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేసి ధరల విషయంలో నిర్ణయం తీసుకోవటం కోసం జులై 17న సమావేశం నిర్వహించనుంది.

ధరల సవరణ కోసం మద్యం ఉత్పత్తి సంస్థల విజ్ఞప్తి

ఇప్పటికే మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వానికి ధరల సవరణ కోసం అనేకమార్లు విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలో ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మద్యం ధరల పెంపు, కొత్త ధరల అమలు, బాటిల్స్ సైజ్ వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ts liquor prices may increase shock for liquor lovers Price determination committee meeting on july 17th

ధరల నిర్ణయ కమిటీకి సమస్యలు వివరించిన ఉత్పత్తి సంస్థల యాజమాన్యాలు

మద్యం తయారీ డిస్టలరీలకు మద్యం ఉత్పత్తి ఖర్చులు, పన్నులు, రవాణా వ్యయాలు బాగా పెరిగిన నేపధ్యంలో తయారీదారులు ధరల పెంపుకు పట్టుబడుతున్నారు. ప్రస్తుత ధరలతో విక్రయాలు చేయటం కష్టంగా మారిందని వారు ధరల నిర్ణయ కమిటీకి వివరించినట్టు సమాచారం. అయితే ఈ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

భారీగా ధరలు పెంచకుండా క్రమంగా సర్దుబాటు చేసే అవకాశం

అయితే ఒకేసారి భారీగా ధరలు పెంచకుండా క్రమంగా సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే కొన్ని నివేదికల ప్రకారం ధరలు 10 నుండి 20 శాతం వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ధరల విషయం మాత్రమే కాకుండా బాటిళ్ళ సైజ్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా నిర్ణయం

కొత్తగా 150ml సైజ్ బాటిల్స్ ప్రవేశపెట్టాలని తయారీ సంస్థల సూచనలను కూడా పరిశీలించనున్నారు. మార్కెట్ లో కొత్తగా వీటిని తీసుకురావటం, వినియోగదారులకు మరిన్ని ఎంపికలు చేసుకునే అవకాశం కల్పించాలని కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అన్ని అంశాలపై సమావేశంలో చర్చించి ప్రభుత్వం వినియోగాదారులపైనా భారీగా భారం పడకుండా తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం

త్వరలోనే సమావేశం జరగనున్న సమయంలో మద్యం వినియోగదారులు ధరల పెంపుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వ ఆదాయం పెంచుకునేలా, అలాగే ఉత్పత్తి కంపెనీల సమస్యలు పరిష్కరించేలా, మద్యం వినియోగదారులకు ఎక్కువ భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+