పవన్ నివాసానికి గవర్నర్, పరామర్శ - అక్కడే ప్రత్యేకంగా..!!
ఏపీ గవర్నర్ అబ్డుల్ నజరీ డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి వెళ్లారు. తాజాగా ముంబాయిలో భుజానికి సర్జరీ చేయించుకున్న పవన్ హైదరాబాద్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో, పవన్ ఇంటికి వెళ్లిన గవర్నర్ ఆయన ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేసారు. భుజానికి గాయం.. సర్జరీతో పాటుగా రెండో సారి సర్జరీ గురించి వైద్యులు చెప్పిన అంశాలను గవర్నర్ తో పవన్ పంచుకున్నారు. ఇదే సమయంలో పవన్ ఇంట్లోని లైబ్రరీని ప్రత్యేకంగా గవర్నర్ పరిశీలించారు.
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.

పవన్ ఇంటికి వచ్చిన గవర్నర్ కు కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. పరామర్శ తరువాత పవన్ కళ్యాణ్ లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ పలు ఆసక్తికర అంశాల పైన చర్చించారు. పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన గురించి వివరాలు సేకరించారు. ప్రత్యేకంగా కొన్ని పుస్తకాల గురించి పవన్ కళ్యాణ్తో ఆసక్తిగా చర్చించారు.

పవన్ పుస్తకాల లైబ్రరీ పరిశీలన.. ఆటోగ్రాఫ్
కాగా, పవన్ కళ్యాణ్ కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. కొద్ది రోజులుగా పవన్ భుజం సమస్యతో బాధ పడుతున్నారు. తాజాగా ముంబాయిలోని ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నారు. అయిదు రోజుల విశ్రాంతి తరువాత డిశ్చార్జ్ అయ్యారు. రెండో భుజానికి సర్జరీ అవసరం అయినా.. కొంత సమయం తరువాత చేయాలని వైద్యులు నిర్ణయించారు. ముంబాయి ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే పవన్ ను సీఎం చంద్రబాబు, జనసేన నేతలు పరామర్శించారు. మరి కొద్ది రోజులు పవన్ తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications